Hyderabad Road: డౌట్ వద్దు ఇది రోడ్డె.. అదీ మన గ్రేట్ హైదరాబాద్ లోనిదే.! అధికారులకు చుక్కలే..

|

Sep 21, 2022 | 1:02 PM

ఇక్కడ కనిపిస్తున్న రోడ్డు చూశారుగా.. ఎలా వుంది? రోడ్డు చూస్తే పొలాల్లోకి వెళ్ళే పుంత దారిలా ఉంది కదూ.. కానీ పక్కన చూస్తే బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. ఇదెక్కడబ్బా అనే డౌట్ వస్తోందా? అక్కడెక్కడో


ఇక్కడ కనిపిస్తున్న రోడ్డు చూశారుగా.. ఎలా వుంది? రోడ్డు చూస్తే పొలాల్లోకి వెళ్ళే పుంత దారిలా ఉంది కదూ.. కానీ పక్కన చూస్తే బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. ఇదెక్కడబ్బా అనే డౌట్ వస్తోందా? అక్కడెక్కడో పల్లెటూరిలో రొడ్డని అనిపిస్తోందా? అలాంటి అనుమానం వస్తే మీరు తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఇది మన గ్రేటర్ హైదరాబాద్ లోని గ్రేట్ కాప్రా మున్సిపాలిటీలో ఉన్న ప్రాంతం.
చినుకు పడితే చిత్తడి అనే మాట అనుకుంటాం కదా.. ఇది దానికంటే ఎక్కువ కాదు.. అసలు దీనిని వర్ణించే పదం కూడా లేదు. ఎందుకంటే, వాన కురిసిందంటే ఇక్కడ ఉంటున్న ప్రజలు తమ వాహనాలు దూరంగా వదిలి పెట్టి కాలినడకన ఇంటికి చేరాల్సిందే. అలా అని నడవడానికి అయినా బానే ఉందని అనుకునేరు.. రోడ్డు గుంతల్లో పడి కాళ్ళు విరగ్గొట్టుకున్న వారూ ఉన్నారు.కాప్రా మున్సిపల్ పరిధిలోని సాకేత్ కాలనీలో ఒ చివరగా ఉన్న ప్రాంతం ఇది. ఈ రోడ్డుకు అటుపక్క జవహర్ నగర్ కు చెందిన వంపు గూడ గ్రామం ఉంది. అక్కడ నుంచి మురికి నీరు.. వర్షం నీరు అన్నీ కలిసి నేరుగా ఈ రోడ్డు మీదుగా కిందికి వెళ్లిపోతాయి. వర్షం వస్తే వాన నీరు.. వర్షం వెలిశాకా మురికి నీరు.. ఇక ఈ వర్షాల ధాటికి అక్కడి వారు స్వంతంగా వేసుకున్న మతటిరోడ్డు కొట్టుకుపోయింది. ఇది ఈరోజు సమస్య కాదు గత నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి. ఈ ప్రాంత ప్రజలు కలవని అధికారి లేదు.. తిరగని ఆఫీసూ లేదు. మున్సిపల్ ఆఫీసు చుట్టూ తిరిగి.. ట్విట్టర్ లో అధికారులకు విన్నపాలు చేసి ఇన్క చేయడానికి ఏమీ లేక.. ఏమి చేయాలో తోచక అయోమయంలో ఉన్నరు. ఇప్పటికైనా ఈ రోడ్డును సరి చేయండి మహా ప్రభో అని అధికారులను.. నాయకులనూ వేడుకుంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

MLA viral video: ప్రభుత్వ పాఠశాల టాయిటెట్స్ శుభ్రం చేసిన ఎమ్మెల్యే.. అశుభ్రంగా ఉండటంపై సీరియస్..(వీడియో)

Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..

Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..

Published on: Sep 21, 2022 01:02 PM