Helicopter Crashes: అరుదైన ఘటన.! కూలిన చాపర్.. సేఫ్‌గా బయటపడ్డ నలుగురు.!
మహారాష్ట్రలో హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ముంబయి నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ హెలికాప్టర్ పుణే జిల్లాలోని పావడ్ గ్రామం వద్ద కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్ లో పైలెట్ సహా నలుగురు ఉన్నారు. సాధారణంగా హెలికాప్టర్, విమానాలు కూలిపోయిన ఘటనల్లో ప్రాణాలతో బయటపడడం అనేది చాలా అరుదైన విషయం. ఇవాళ జరిగిన ప్రమాదంలో పైలెట్ కు గాయాలు కాగా, మిగిలిన ముగ్గురికి ఏమీ కాలేదు.
మహారాష్ట్రలో హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ముంబయి నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ హెలికాప్టర్ పుణే జిల్లాలోని పావడ్ గ్రామం వద్ద కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్ లో పైలెట్ సహా నలుగురు ఉన్నారు. సాధారణంగా హెలికాప్టర్, విమానాలు కూలిపోయిన ఘటనల్లో ప్రాణాలతో బయటపడడం అనేది చాలా అరుదైన విషయం. ఇవాళ జరిగిన ప్రమాదంలో పైలెట్ కు గాయాలు కాగా, మిగిలిన ముగ్గురికి ఏమీ కాలేదు. గాయపడిన పైలెట్ ను ఆసుపత్రికి తరలించినట్టు పుణే జిల్లా ఎస్పీ పంకజ్ దేశ్ ముఖ్ తెలిపారు. కూలిపోయిన హెలికాప్టర్ గ్లోబల్ వెక్ట్రా అనే ప్రైవేటు విమానయాన కంపెనీకి చెందింది. ఇది అగస్టా వెస్ట్ ల్యాండ్ ఏడబ్ల్యూ-139 రకానికి చెందిన హెలికాప్టర్. రెండు ఇంజిన్లు ఉండే ఈ చాపర్ లో 8 నుంచి 12 మంది ప్రయాణించవచ్చు. ప్రతికూల వాతావరణం కారణంగానే ఈ హెలికాప్టర్ కూలిపోయి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఘటనపై డీజీసీఏ విచారణ జరపనుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.