డబ్బుల కోసం.. తప్పుడు మార్గాలు తొక్కడం ద్వారా ఆమెకు HIV సోకిందన్నారు హెల్త్ ఆఫీసర్. ఆమె వ్యసనాన్ని ఆసరాగా చేసుకుని చాలామంది యువకులు డబ్బు ఆశజూపి.. కొందరు డ్రగ్స్ ఆశచూపించి లోబర్చుకున్నట్లు తేల్చారు. ఇలా ఆమె ద్వారా యువకులందరికీ వ్యాధి సోకినట్లు అనుమానిస్తున్నారు. సాధారణంగా రాష్ట్రం మొత్తం ఏడాదికి 20 కేసులు వస్తుంటాయని.. ఇలా ఒకేసారి ఒకే ప్రాంతంలో 19మందికి ఎయిడ్స్ రావడంతో షాక్‌కు గురిచేస్తోంది. ఇంకా ఎంతమందికి ఈ వ్యాధిసోకింది అనేది ఆరాతీస్తున్నారు. కేవలం రామ్‌నగర్ ప్రాంతంలో 17 నెలల్లో 45 కేసులు బయటపడ్డాయన్నారు అధికారులు. ఇప్పుడు వ్యాధిసోకిన వారు ఒక్కరొక్కరిగా అనారోగ్యం బారిన పడడాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకుని వారికి టెస్టులు చేయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఇప్పుడు ఎయిడ్స్ సోకిన వారిలో చాలామంది పెళ్లైన వారే అంటున్నారు పోలీసులు. అయితే ఎయిడ్స్ సోకిన వారికి ఒకే అమ్మాయి ద్వారా వచ్చినట్లు తెలియదని.. ఒకరి తెలియకుండా ఒకరితో ఆమె రిలేషన్ మెయింటైన్ చేయడంతో ఇలా జరిగిందంటున్నారు. విచ్చలవిడి తనానికి వెళ్తే ఇలాంటి అనర్థాలే వస్తాయంటున్నారు ప్రభుత్వాధికారులు, డాక్టర్లు. యువత నిగ్రహంతో ఉండాలని సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.