Hinduism abroad: విదేశాల్లో హిందూ సంప్రదాయం.. శ్రీరామకృష్ణ భజన చేస్తున్న విదేశీయులు..

|

Jul 20, 2022 | 6:17 PM

ప్రపంచం మొత్తం భారతీయ సంస్కృతితో ముడిపడి ఉంది. ప్రపంచంలోని నలుమూలల నుండి ప్రజలు మనదేశంలోని ఆలయాలు, క్షేత్రాలను, పవిత్ర స్థలాలను దర్శించుకోవడానికి, పూజలను నిర్వహించడానికి వస్తున్నారు.


ప్రపంచం మొత్తం భారతీయ సంస్కృతితో ముడిపడి ఉంది. ప్రపంచంలోని నలుమూలల నుండి ప్రజలు మనదేశంలోని ఆలయాలు, క్షేత్రాలను, పవిత్ర స్థలాలను దర్శించుకోవడానికి, పూజలను నిర్వహించడానికి వస్తున్నారు. ముఖ్యంగా ఇస్కాన్ సంస్థ విదేశాల్లో కృష్ణ మందిరాలను ఏర్పాటు చేసి.. సనాతన ధర్మం వైశిష్ట్యాన్ని పరిచయం చేస్తోన్న నేపథ్యంలో హిందూ సాంప్రదాయాలకు విదేశీయలు ఆకర్షితులవుతున్నారు. తాజాగా సోషల్‌ మీడియాలో ఓ విదేశీ భక్తుడు శ్రీరామనామ సంకీర్తన చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా.. విదేశీయులు హిందీ బాషాను మాట్లాడటానికి ఇబ్బంది పడుతుంటారు.. అయితే ఈ వీడియోలోని ఓ వ్యక్తి హిందీలో అద్భుతంగా శ్రీరామనామ గానం చేస్తూ భజన చేస్తున్నాడు. హార్మోనియం వాయిస్తూ ‘హరే రామ-హరే కృష్ణ’ కీర్తనను శ్రావ్యంగా పడుతున్నాడు. ఈ శ్లోకాన్ని భారతదేశంలోనే కాదు.. విదేశాలలో కూడా చాలా మంది ఇష్టపడటం విశేషం. అంతేకాదు ఆ వ్యక్తి వెనుక కొంతమంది విదేశీ స్త్రీలు భక్తితో నృత్యం చేస్తున్నారు. రామ నామ స్మరణలో విదేశీయులు మునిగిపోయారు. విదేశీ వ్యక్తి నోట వినిపిస్తున్న ఈ శ్రీరామ,శ్రీకృష్ణ భజనలను నెటిజన్లు ఇష్టపడుతున్నారు. ఈ హృదయాన్ని హత్తుకునే వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను చూస్తున్న లక్షలమంది నెటిజన్లు విదేశీయుల భక్తికి ముగ్దులవుతున్నారు. రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Aliens Kidnap: నన్ను నా భార్యను ఏలియన్స్‌ కిడ్నాప్‌ చేశాయ్‌.. అందుకే భవిష్యత్తు ముందే నాకు తెలుస్తోంది.!

Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..

Urfi Javed: ఇదేం ఫ్యాషన్‌రా బాబు.. ఒంటి నిండా బ్లేడ్‌లతో అరాచకం చేసేసిందిగా..

Published on: Jul 20, 2022 06:17 PM