కొడుకు ప్రాణాల కోసం చిరుతతో పోరాడిన తండ్రి.. చివరికి
గుజరాత్‌లో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. గిర్ సోమనాథ్ జిల్లాలో 60 ఏళ్ల వృద్ధుడు బాబూభాయ్, తన కొడుకును రక్షించుకునేందుకు ఓ చిరుతపులితో పోరాడి దానిని హతమార్చాడు. ఈ పోరాటంలో తండ్రీకొడుకులిద్దరికీ గాయాలయ్యాయి. అయితే, ప్రాణరక్షణ కోసం చేసిన ఈ చర్యకు అటవీ శాఖ అధికారులు వారిపై కేసు నమోదు చేశారు. మానవ-వన్యప్రాణి సంఘర్షణ తీవ్రతను ఈ ఘటన తెలియజేస్తోంది.
గుజరాత్‌లో ‘మనిషికి, వన్యప్రాణికి’ మధ్య జరిగిన ఓ నాటకీయ పోరాటంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. తన కొడుకు ప్రాణాలను కాపాడుకునేందుకు 60 ఏళ్ల వృద్ధుడు ఓ చిరుతపులితో పోరాడి, దాన్ని కొడవలి, ఈటెతో హతమార్చాడు. అయితే, ప్రాణ రక్షణ కోసం చేసిన ఈ పోరాటం వారిపై కేసు నమోదయ్యేలా చేసింది. ఈ ఘటన గిర్ సోమనాథ్ జిల్లాలోని ఉనా ప్రాంతంలో జరిగింది. బాబూభాయ్ నారన్‌భాయ్ వాజా అనే 60 ఏళ్ల వృద్ధుడు రాత్రివేళ ఇంటి వద్ద ఉన్న షెడ్‌లో కూర్చుని ఉన్నాడు. చీకటిలో ఎక్కడినుంచి వచ్చిందో ఓ చిరుత అకస్మాత్తుగా వృద్ధుడిపై దాడి చేసింది. ఆయన కేకలు వేయడంతో ఇంట్లో ఉన్న 27 ఏళ్ల కుమారుడు శార్దూల్ బయటకు పరుగెత్తుకొచ్చాడు. వెంటనే చిరుత బాబూభాయ్‌ను వదిలి శార్దూల్‌పై దాడి చేసింది. వెంటనే అలర్ట్ అయిన బాబూభాయ్ అక్కడే ఉన్న ఈటె, కొడవలి తీసుకుని చిరుతపై ఎదురుదాడి చేశాడు. కొడుకును కాపాడే ప్రయత్నంలో చివరకు చిరుత మృతి చెందింది. ఈ ఘటనలో తండ్రీకొడుకులిద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో వారిని ముందుగా ‘ఉనా’ ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని, దాడిలో ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. చిరుత కళేబరాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వన్యప్రాణిని హతమార్చిన ఘటనపై బాబూభాయ్, శార్దూల్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో బాబూభాయ్ స్పందిస్తూ.. రాత్రి తాను షెడ్‌లో ఉన్నప్పుడు చిరుత వచ్చిందని, దానిని భయపెట్టడానికి కేకలు వేస్తే, అది తనపై దాడి చేసి గొంతు పట్టుకుందని తెలిపాడు. తన కొడుకు రాగానే చిరుత తనను వదిలి కుమారుడిపై దాడిచేసిందని, కుమారుడిని కాపాడే ప్రయత్నంలో చివరకు కొడవలితో చిరుతను చంపేశానని బాబూభాయ్ తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తవ్వే కొద్దీ బంగారు నాణేలు.. పరుగు పరుగున వెళ్తున్న జనాలు.. ఎక్కడంటే
హైదరాబాద్‌లో మరో నకిలీ డాక్టర్ గుట్టురట్టు.. అర్హతలు లేకున్నా వైద్యం