Cock: యజమానిని నిద్ర లేపడానికి ఈ కోడి ఏంచేసిందో చూడండి..! క్యూట్ కోడి అంటున్న నెటిజనం..
ఓ పక్క ఆఫీసుకి టైమ్ అయిపోతున్నా.. ముసుగు తన్ని గుర్రు పెట్టి నిద్రపోతుంటారు కొందరు. అందుకు కారణాలు ఏమైనా... ఆనక బాస్‌తో తిట్లు తింటారు. పాపం త్వరగా లేవాలని అలారం పెట్టుకుంటారు..
ఓ పక్క ఆఫీసుకి టైమ్ అయిపోతున్నా.. ముసుగు తన్ని గుర్రు పెట్టి నిద్రపోతుంటారు కొందరు. అందుకు కారణాలు ఏమైనా… ఆనక బాస్‌తో తిట్లు తింటారు. పాపం త్వరగా లేవాలని అలారం పెట్టుకుంటారు.. కానీ అది మోగినప్పుడు అప్పుడే తెల్లారిందా నీకు అంటూ దాన్ని ఒక్కటి కొట్టి ఆపేసి మళ్లీ పడుకుంటారు. ఇదిగో ఈ వీడియోలో ఓ వ్యక్తి కూడా అలాగే చేస్తున్నాడు. బారెడు పొద్దెక్కినా ముసుగు తన్ని గుర్రుపెట్టి మరీ నిద్రపోతున్నాడు. ఇంతలో అతని పెంపుడు కోడి అక్కడికి వచ్చింది. తన యజమాని గుర్రు పెట్టి నిద్రపోవడం చూసి.. ఓర్నీ నేను లేవడం.. ఊరందర్నీ లేపడం కూడా అయిపోయింది.. నువ్వింకా ముసుగుతన్ని పడుకుంటావా… ఉండు నీ పని చెప్తానంటూ అతని తల దగ్గరకు వెళ్లి ఒక్కటే అరవడం మొదలు పెట్టింది.. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ నవ్వులు పూయిస్తోంది. వీడియో చూసిన నెటిజన్లు అబ్బా ఎంత మంచి కోడి.. ఇలాంటి కోడి మాకూ ఉంటే బావుండును అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఆ ఫన్నీ వీడియోను మీరూ చూసేయండి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
Wife Permission: మీరు మద్యం తాగాలంటే భార్య అనుమతి తప్పనిసరి.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంకే.!
killer lady: భర్తకు తెలియకుండా ఇద్దరితో అఫైర్.. ఆ తర్వాత ఓ మర్డర్.. సినిమాను మించిన సస్పెన్స్..