కోడే కదా అని లైట్‌ తీసుకుంటే.. ఇలాగే ఉంటది !!

|

Nov 29, 2022 | 9:45 AM

తెలంగాణలోని కొమురంభీం జిల్లా బాబాసాగర్ గ్రామంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. కోడిని లారీ ఢీకొట్టడంతో ధర్నాకు దిగారు గ్రామస్తులు. దాంతో రోడ్డంతా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

తెలంగాణలోని కొమురంభీం జిల్లా బాబాసాగర్ గ్రామంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. కోడిని లారీ ఢీకొట్టడంతో ధర్నాకు దిగారు గ్రామస్తులు. దాంతో రోడ్డంతా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రోడ్డు పొడవునా లారీలు నిలిచిపోయాయి. గ్రామస్తుల దెబ్బకు పోలీసులు రంగంలోకి దిగారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చింతలమానేపల్లి మండలం బాబాసాగర్ గ్రామంలో పోచమ్మవాడ ప్రధాన రహదారిని దాటుతున్న కోడిని కంకర లోడ్‌తో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. అది గమనించి ఆగ్రహానికి గురైన గ్రామస్తులు.. కోడిని ఢీకొట్టిన లారీని అడ్డగించారు. దంద్రే బండయ్యకు చెందిన కోడి రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో లారీని ఆపి ఆందోళనకు దిగారు స్థానికులు. ప్రధాన రహదారి మట్టి, కంకర పనులను అడ్డుకుని నిరసన తెలిపారు. దాంతో లారీల రాకపోకలు నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్ అయ్యింది. ఈ విషయాన్ని లారీ డ్రైవర్లు పోలీసులకు తెలియజేశారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు.. గ్రామస్తులకు సర్దిజెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బాబాసాగర్ గ్రామంలో కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫుడ్‌ డెలివరీ చేస్తూ మహిళకు ముద్దు పెట్టేసిన బోయ్‌ !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

రైల్వే స్టేషన్‌లో హార్ట్‌ టచ్చింగ్‌ సీన్‌ !! నిజమైన ప్రేమకు నిదర్శనం అంటున్న నెటిజెన్స్

ఇండియన్‌ సాంగ్‌కు డాన్స్‌ ఇరగదీసిన విదేశీ యువతి !! ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

భారతీయులకు యూఏఈ కొత్త నిబంధనలు.. పాస్‌పోర్టులో పూర్తి పేరు లేకుంటే సౌదీకి నో ఎంట్రీ..

నందిగామలో అరుదైన సంఘటన.. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన తల్లి

 

Follow us on