Hen Viral Video: ఈ కోడి నువ్వు కేక.. దెబ్బకు నెటిజన్లు నోరెళ్లబెట్టారుగా.. వైరల్ అవుతున్న వీడియో..
నెట్టింట వైరల్ వీడియోలకు కొదవే లేదు.. ఎక్కడ ఏచిన్న సంఘటన విచిత్రంగా కనిపించినా.. మొబైల్లో రికార్డ్ చేయడం... నెట్‌లో పోస్ట్ చేస్తుంటారు చాలామంది... దాంతో అది క్షణాల్లో వైరల్ గా మారిపోతుంటుంది. ముఖ్యంగా జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోల
నెట్టింట వైరల్ వీడియోలకు కొదవే లేదు.. ఎక్కడ ఏచిన్న సంఘటన విచిత్రంగా కనిపించినా.. మొబైల్లో రికార్డ్ చేయడం… నెట్‌లో పోస్ట్ చేస్తుంటారు చాలామంది… దాంతో అది క్షణాల్లో వైరల్ గా మారిపోతుంటుంది. ముఖ్యంగా జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన ఇళ్ళదగ్గర ఎక్కువగా కనిపించే వాటిలో కోడి ఒకటి.. నిజానికి కోడి పక్షి జాతికి చెందినదే అయినప్పటికీ అది ఎగరలేదు. కానీ ఓ కోడి రయ్‌న ఎగురుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతంఈ కోడికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చెక్కర్లు కొడుతుంది. ఈ కోడి చేసిన పనికి అందరూ అవాక్ అవుతున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియో ఎక్కడిదో తెలియదు కానీ. కోళ్ల మంద నుంచి దూరంగా ఎగిరింది ఓ కోడి.. అది ఏకంగా ఓ కాలువను ఇవతలి గట్టునుంచి అవతలి గట్టుకి దాటేసింది. పందెం వేసుకొని మరీ దాటినట్టుగా ఆ కోడి కాలువను దాటడం ఇప్పుడు అందరినీ షాక్ కు గురిచేస్తుంది. వైరల్‌గా మారిన ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఎగిరే పక్షి ఆత్మ ఈ కోడిలో ప్రవేశించిందని కొందరూ.. యాక్షన్ సినిమాలు ఎక్కువ చూసి ఉంటుందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి ఓ కోడి ఇలా ఎగురుతూ కాలువను దాటడం మాములు విషయం కాదు. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.
మరిన్ని చూడండి ఇక్కడ:
Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..
Viral Video: వారేవా ఇది కదరా స్నేహమంటే.. దివ్యాంగుడిని భుజాలపై తిప్పిన గర్ల్స్.. వైరల్ వీడియో
Ram Charan-Urfi Javed: రామ్ చరణ్ కు పడిపోయిన.. బాలీవుడ్ శృంగార తార.. ఓపెన్ ఆఫర్ అంటూ ఇలా..
Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..