90 ఏళ్ల అత్తగారిని బుట్టలో కూర్చోబెట్టి.. నెత్తిన పెట్టుకుని కోడలి పాదయాత్ర!

Updated on: Jun 06, 2026 | 5:05 PM

వృద్ధులైన తల్లిదండ్రులను చూసుకోవడానికే వెనుకాడుతున్న ఈ రోజుల్లో, హరియాణాకు చెందిన జానపద గాయని కాజల్ చౌధరి తన 90 ఏళ్ల అత్తగారిని నెత్తిన మోస్తూ 260 కిలోమీటర్ల బ్రిజ్ పరిక్రమ యాత్ర చేయడం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. అత్తగారి ఆధ్యాత్మిక కోరికను నెరవేర్చేందుకు ఆమె చేసిన ఈ త్యాగం నెటిజన్లను భావోద్వేగానికి గురిచేస్తోంది.

ఈ రోజుల్లో వృద్ధులైన తల్లిదండ్రులను చూసుకోవడమే భారంగా భావిస్తున్న తరుణంలో.. అత్తగారి చిరకాల కోరికను తీర్చడం కోసం హరియాణాకు చెందిన జానపద గాయని కాజల్ చౌధరి చేసిన ఒక అద్భుత సాహసం దేశవ్యాప్తంగా అందరి గుండెలను హత్తుకుంటోంది. నడవలేని స్థితిలో ఉన్న తన 90 ఏళ్ల అత్తగారిని ఒక పెద్ద టబ్‌లో కూర్చోబెట్టుకుని, నెత్తిన పెట్టుకొని మోస్తూ ఏకంగా 260 కిలోమీటర్ల ఆధ్యాత్మిక పాదయాత్ర చేపట్టారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర, వృందావన్‌లతో పాటు సమీప రాష్ట్రాల్లోని పవిత్ర క్షేత్రాలను సందర్శిస్తూ భక్తులు ‘బ్రిజ్ పరిక్రమ’ చేస్తుంటారు. శ్రీకృష్ణుడు నడయాడిన పవిత్ర స్థలాల గుండా సాగే ఈ యాత్ర సుమారు 84 కోస్ అంటే 260 కి.మీ మేర ఉంటుంది. కాలినడకన ఈ ఆధ్యాత్మిక యాత్రను పూర్తి చేయడానికి సాధారణంగా 40 రోజుల సమయం పడుతుంది. అలాంటిది, వృద్ధురాలైన అత్తగారిని కృష్ణుడి దర్శన భాగ్యం కోసం కాజల్ స్వయంగా మోస్తూ ఈ కఠినమైన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. కాజల్ చౌధరి తన అత్తగారిని మోసుకుంటూ వెళ్తున్న దృశ్యాలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ అద్భుత దృశ్యాన్ని చూసిన నెటిజన్లు అమెను ‘కలియుగ శ్రవణకుమారి’ అంటూ కొనియాడడమే కాకుండా.. ప్రతి ఒక్కరికీ ఈమె ఒక గొప్ప రోల్ మోడల్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పక్క ఫ్లాట్‌ను దొంగచాటుగా రికార్డ్ చేస్తూ పట్టుబడ్డ వృద్ధుడు

2027లో AI తుఫాను? మూడేళ్లే టైమ్.. మేలుకోకపోతే మనుగడ కష్టమే

Follow Us