Instagram Reels: సముద్రంలోకి కార్లతో డ్రైవింగ్.. రీల్స్ పిచ్చితో ఇరుక్కున్న యువకులు.
రీల్స్ అప్‌లోడ్ చేసి లైక్‌లు కొట్టేయాలన్న పిచ్చి యువతలో రోజురోజుకీ పెరిగిపోతుంది. సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోవటంతో.. ఆ క్రేజ్‌ను ఉపయోగించుకుని ఓవర్ నైట్ స్టార్ కావాలని పిచ్చి పిచ్చి ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. కొన్నిసార్లు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇలాంటి చేష్టలు వద్దని ఇతరులు వారించినా వారి ప్రవర్తనలో మాత్రం మార్పు రావడం లేదు.
రీల్స్ అప్‌లోడ్ చేసి లైక్‌లు కొట్టేయాలన్న పిచ్చి యువతలో రోజురోజుకీ పెరిగిపోతుంది. సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోవటంతో.. ఆ క్రేజ్‌ను ఉపయోగించుకుని ఓవర్ నైట్ స్టార్ కావాలని పిచ్చి పిచ్చి ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. కొన్నిసార్లు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇలాంటి చేష్టలు వద్దని ఇతరులు వారించినా వారి ప్రవర్తనలో మాత్రం మార్పు రావడం లేదు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం కొంతమంది యువకులు తమ కారును సముద్రంలోకి నడిపి ప్రమాదంలో చిక్కుకున్నారు. ఈ ఘటన గుజరాత్‌లోని కచ్ సముద్ర తీరంలో జరిగింది.
ఇద్దరు యువకులు రీల్స్ కోసం తమ రెండు ఎస్‌యూవీ కారులను ముంద్రా సముద్ర తీరంలోకి పోనిచ్చారు. నీటి లోతు పెరగడం, అలల కారణంగా రెండు వాహనాలు దాదాపు నీటిలో మునిగిపోయాయి. దీంతో వాటి నుంచి బయటకు రాలేక.. అలాగని ఆ వాహనాలను బయటకు తీసుకురాలేక ఆ యువకులు చాలా ఇబ్బంది పడ్డారు. వాహనాలను నీటిలో నుంచి బయటకు తీయడానికి చాలా కష్టపడ్డారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. స్థానికుల సహాయంతో ఎట్టకేలకు వాహనాలను నీటిలో నుంచి బయటకు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, కచ్ పోలీసులు ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రెండు ఎస్‌యూవీలను స్వాధీనం చేసుకున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.