40 ఏళ్ల క్రితం హత్య చేసా.. వేధిస్తున్న అపరాధ భారం.. ! లొంగిపోయిన కిల్లర్

Updated on: Jun 05, 2026 | 5:39 PM

నలభై ఏళ్లుగా మనసులో మోస్తున్న అపరాధ భావన చివరకు ఓ వ్యక్తిని పోలీసుల ముందుకు తీసుకొచ్చింది. 1986లో జరిగిన ఓ హత్యకు తానే కారణమని మహమ్మద్ అలీ లొంగిపోవడంతో, అప్పట్లో సాధారణ మరణంగా మూసివేసిన కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. పాత రికార్డులు, మిస్సింగ్ కేసుల ఆధారంగా పోలీసులు విచారణ జరిపి మిస్టరీని ఛేదించారు.

దశాబ్దాల క్రితం.. యుక్తవయసులో ఉన్నప్పుడు చేసిన నేరం అతడిని వెంటాడింది. వాస్తవాన్ని గ్రహించిన అతడు.. దాదాపు నలభై ఏళ్ల క్రితం ఒక హత్య చేశానని చెబుతూ పోలీసుల ముందు లొంగిపోయాడు. ఈ రహస్యాన్ని దాచిపెట్టి బతకడం తనవల్ల కావడం లేదని, అపరాధ భారాన్ని మోయలేకపోతున్నానని చెప్పాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ కేసును తవ్వి బయటకు తీసారు. ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్‌కు వచ్చి, ఆ హత్యను తానే స్వయంగా చేశానని చెప్పి లొంగిపోయాడు. అది తను తెలియక చేసిన తప్పు అని, ఇప్పుడు పశ్చాత్తాపంతో లొంగిపోతున్నట్లు తెలిపాడు. కోర్టు విధించే ఎలాంటి శిక్షకైనా తాను సిద్ధమని ప్రకటించాడు. అయితే ఈ వింత కేసును ఛేదించడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. నలభై ఏళ్ల క్రితం నాటి హత్య ఇప్పుడు హంతకుడి పశ్చాత్తాపంతో బయటపడింది. కేరళలో 40 ఏళ్ల క్రితం జరిగిన హత్య మిస్టరీ వీడింది. మహమ్మద్ అలీ ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రకారం.. 1986లో కూడరంజి వద్ద బాధితుడు తనపై లైంగిక దాడికి ప్రయత్నించాడని.. ఆత్మరక్షణలో భాగంగా అతడిని తన్నడంతో ఓ కాలువలో పడిపోయినట్లు మహమ్మద్‌ అలీ పోలీసులకు చెప్పాడు. భయంతో తర్వాత అక్కడ నుంచి పారిపోయానని, రెండు రోజుల తర్వాత వచ్చి చూసేసరికి ఆ నీటిలోనే అతడు విగతజీవిగా పడి ఉన్నట్లు వివరించాడు. అయితే, పోలీసులు దీన్ని సాధారణ మరణంగా చెప్పడం.. మృతుడి తరఫున ఎవ్వరూ రాకపోవడంతో ఆ కేసును క్లోజ్‌ చేశారు. క్లూ ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. 1980లో మలబార్ ప్రాంతంలో నమోదైన పాత మిస్సింగ్ కేసుల ఫైల్స్‌ను పరిశీలించారు. డిసెంబర్ 1986లో ఒక పత్రికలో వచ్చిన వార్త కీలకమైంది. కూడరంజి మిషన్ హాస్పిటల్ వెనుక పొలాల్లో గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యమైనట్లు ఆ వార్తలో ఉంది. శాస్త్రీయ విచారణ అనంతరం మృతుడు కన్నూర్ జిల్లాకు చెందిన మోహనన్‌గా గుర్తించారు. నిందితుడి వాంగ్మూలానికి, ఘటనా స్థలానికి సరిగ్గా సరిపోలడంతో కేసును ధృవీకరించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ. కోటి విలువైన నోట్లు.. కాలేజీ గదిలో చెదలు..

మృగశిర కార్తె సందడి.. ఏపీలో అలా.. తెలంగాణలో ఇలా

Weather Update: ఆ.. 17 రాష్ట్రాలకు హై అలర్ట్‌.. ఆకాశం నుండి ఊడిపడనున్న గండం

Peddi: కన్నడ కిర్రాక్‌ కలెక్షన్స్‌.. నెంబర్‌ 1గా హీరో మనోడే..!

Peddi: టికెట్స్ తెగడంలో.. పెద్ది రికార్డ్

Loading...
Unable to load recommendations.
Follow Us