పెళ్లి వేదికపై వరుడికి అవమానం.. వధువు నవ్వడంచూసి వరుడు ఏంచేశాడో తెలుసా ??

|

Mar 28, 2023 | 8:26 PM

పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు... అందుకే ఆ వివాహాన్ని ఎందో సంప్రదాయంగా జరిపేందుకు పెద్దలు ఎన్నో పద్ధతులు పాటిస్తారు. ఆహ్వాన పత్రికల నుంచి విందు భోజనాల వరకూ ఎంతో శ్రద్ధ తీసుకుంటారు.

పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు… అందుకే ఆ వివాహాన్ని ఎందో సంప్రదాయంగా జరిపేందుకు పెద్దలు ఎన్నో పద్ధతులు పాటిస్తారు. ఆహ్వాన పత్రికల నుంచి విందు భోజనాల వరకూ ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. ఇక పెళ్లంటే పట్టు చీరలు, వరుడికి సూటు, బూటు వగైరా మామూలే.. ఇలా ఎన్ని ఉన్నా.. పెళ్లిలో వరుడికి పంచెకట్టు తప్పనిసరి. ఇక్కడే వరుడికి చిక్కు వచ్చి పడుతుంది. అప్పటివరకూ షార్ట్‌లు, ప్యాంట్లు వేసుకు తిరిగిన అతనికి పంచెకట్టు పెద్ద సమస్యే…పంచె ఎక్కడ జారిపోతుందో అని భయం వెంటాడుతూ ఉంటుంది. ఈ బాధ భరించలేక కొందరు పంచెను పోలిన పైజామాలు ధరిస్తారు. తాజాగా ఓ వరుడకి అలాంటి అనుభవమే ఎదురైంది. వధువు మెడలో వరమాల వేస్తుండగా అతని పైజామా జారిపోయింది. అది చూసి వధువు సిగ్గుతో ముసి ముసిగా నవ్వుకుంటుంది. వధువు అలా నవ్వడం చూసిన వరుడు తన పైజామా జారినట్లు గ్రహించి వెంటనే పైకి లాక్కుని పక్కకు వెళ్లిపోతాడు. అది చూసి వధువు మరింత నవ్వుతుంది. ఈ సంఘటన అంతా వీడియో తీసిన కొందరు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌ అయిపోయింది.వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో హోరెత్తించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చివరిసారిగా కూతురితో ఆట.. ఏడిపిస్తున్న తారకరత్న లాస్ట్ వీడియో

మమ్మల్ని అవమానిస్తున్నారు.. మీడియాకెక్కిన చిరు ఫ్యాన్స్

అర్రె.. నాని కంటే.. ఆ కుర్రాడే సూపరట !!

Prabhas: వావ్ హాలీవుడ్ లోకి ప్రభాస్.. డార్లింగ్ అంటే మాములుగా ఉండదు మరి..

Upasana Konidela: భర్తకు తగ్గ భార్య.. ఉపాసనకు ఇంటర్నేషనల్ అవార్డ్

Published on: Mar 28, 2023 08:26 PM