ఎయిర్‌పోర్ట్‌లో తడబడ్డాడు.. తప్పించుకోలేకపోయాడు !!

|

Apr 15, 2023 | 9:37 AM

అక్రమ రవాణాకు అడ్డు కట్ట వేసేందుకు పోలీసులు, కస్టమ్స్ అధికారులు ఎంతలా చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. అక్రమార్కులు తెలివి మీరిపోయారు. సరికొత్త మార్గాల్లో యధేచ్చగా తమ దందాను కొనసాగిస్తున్నారు.

అక్రమ రవాణాకు అడ్డు కట్ట వేసేందుకు పోలీసులు, కస్టమ్స్ అధికారులు ఎంతలా చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. అక్రమార్కులు తెలివి మీరిపోయారు. సరికొత్త మార్గాల్లో యధేచ్చగా తమ దందాను కొనసాగిస్తున్నారు. తాజాగా చెన్నై ఎయిర్‌పోర్టులో కిలోన్నర బంగారం పట్టుకున్నారు కస్టమ్స్‌ అధికారులు. ఏప్రిల్ 3వ తేదీన అబుదాబీ నుంచి చెన్నై ఎయిర్‌పోర్ట్‌కు 6E-1412 నెంబర్‌తో ఓ విమానం వచ్చింది. రోజూ మాదిరిగానే ఆ సమయంలోనూ కస్టమ్స్ అధికారులు తమ తనిఖీలు నిర్వహించారు. ఆ ఫ్లైట్‌లో నుంచి దిగిన ప్రయాణీకుల్లో ఓ వ్యక్తిపై వారికి అనుమానం వచ్చింది. కస్టమ్స్ అధికారులను చూడగానే అతడు కూడా కాస్త తడబడ్డాడు. అంతే దొరికిపోయాడు. ఆ వ్యక్తి తత్తరపాటును చూసి అనుమానంతో అతన్ని ప్రశ్నించారు కస్టమ్స్‌ అధికారులు. అతను పొంతలేని సమాధానాలు చెప్పడంతో అతని బ్యాగ్ చెక్ చేసారు. అందులో ఓ ఎలక్ట్రిక్ మోటారు లాంటిది కనిపించింది. దాన్ని పగలకొట్టి చూడగా.. అందులో 1.7 కిలోల బంగారం బయటపడింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్మార్ట్‌ ఫోన్‌కి ఎడిక్ట్‌ అయిన కోతి.. ఏం చేసిందో చూడండి

 

Published on: Apr 15, 2023 09:14 AM