గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్న దానిని చూసి.. కాపరులు పరుగో పరుగు
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రాంపూర్‌లో భారీ కొండచిలువ గొర్రెల మందపై దాడికి ప్రయత్నించి వలలో చిక్కుకుంది. గొర్రెల కాపరులు రక్షణగా ఏర్పాటు చేసిన వలలోకి ప్రవేశించే క్రమంలో పాము బందీ అయింది. అటవీశాఖ స్పందించకపోవడంతో స్నేక్ క్యాచర్ అఫ్జల్‌ను పిలిచారు. సుమారు 30 నిమిషాలు శ్రమించి కొండచిలువను సురక్షితంగా బయటకు తీసిన అఫ్జల్, అనంతరం దానిని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రాంపూర్ గ్రామంలో భారీ కొండచిలువ కలకలం రేపింది. ఆహారం కోసం ఏకంగా గొర్రెల మందపై దాడి చేసేందుకు ప్రయత్నించి, చివరకు వలలో చిక్కుకుపోయింది. ఎదురుగా ఆహారాన్ని పెట్టుకొని దాడి చేయలేక.. బయటకు వెళ్లలేక విలవిలలాడిపోయింది. రాంపూర్‌లో గొర్రెల కాపరులు రక్షణగా గొర్రెల మంద చుట్టూ వలలను ఏర్పాటు చేశారు. రాత్రి సమయంలో ఆహారం కోసం వచ్చిన భారీ కొండచిలువ లోపలికి ప్రవేశించే క్రమంలో ఈ వలలో చిక్కుకుపోయింది. తెల్లవారుజామున అక్కడికి వచ్చిన గొర్రెల కాపరులు వలలో భారీ కొండచిలువను చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారుల నుంచి స్పందన రాకపోవడంతో కాపరులు వెంటనే స్నేక్ క్యాచర్ అఫ్జల్‌కు విషయం చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న అఫ్జల్ సుమారు 30 నిమిషాల పాటు శ్రమించి, వలలో చిక్కుకున్న కొండచిలువను సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం దానిని జనవాసాలకు దూరంగా ఉన్న అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. గొర్రెల మంద చుట్టూ వల ఉండటం వల్లే గొర్రెలకు ఎలాంటి హాని జరగలేదని, లేకపోతే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని స్నేక్ క్యాచర్ తెలిపారు. ప్రమాదం తప్పడంతో గొర్రెల కాపరులు, గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సామాన్యుడికి మరో షాక్.. సెప్టెంబర్‌లో పెరగనున్న ధరలు!
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన డ్రైవర్, కండక్టర్.. ఆ తర్వాత
