తెలుగు రాష్ట్రాల్లో వాన దంచికొడుతోంది. పలు ప్రాంతాలను వరదనీరు చుట్టుముట్టింది. వరద ఇబ్బందులే కాదు.. సంతోషాన్ని కూడా తెస్తోంది. వరద ఉధృతికి చెరువుల్లో ఉండాల్సిన చేపలు పంటపొలాల్లోకి కొట్టుకొస్తున్నాయి. కొత్త నీరు రావడంతో చేపలు ఎదురెళ్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో వరదలో చేపలు కొట్టుకు వస్తున్నాయి. పదుల సంఖ్యలో చెరువులు అలుగు పోస్తున్నాయి. దీంతో డబ్బులు పెడితే దొరికే చేపలు, ఇప్పుడు ఫ్రీగా దొరికేస్తున్నాయి. పట్టుకున్నోళ్లకు పట్టుకున్నంత అనేలా ఉంది ఈ సీన్. ముసురుకు చేపలు దొరకుతుండటంతో జనం పండగ చేసుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.