దుకాణాల్లో కొన్న పచ్చళ్లను లొట్టలేసుకుంటూ తింటున్నారా? ఈ వీడియో చూస్తే.. వాటి జోలికి పోరు!

Updated on: Jul 04, 2026 | 8:52 PM

వరంగల్ కాశిబుగ్గలో అక్రమంగా నడుస్తున్న నకిలీ పచ్చళ్ల తయారీ కేంద్రంపై పోలీసులు, టాస్క్‌ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. కుళ్లిపోయిన మామిడి, టమాటా, నిమ్మ, ఉసిరి పచ్చళ్లతో పాటు భారీగా రసాయనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ పచ్చళ్లను వివిధ బ్రాండ్ల పేర్లతో మార్కెట్లో విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆరోగ్యానికి హానికరమని ప్రజలను అప్రమత్తం చేశారు.

తక్కువ ధరకు వస్తున్నాయని దుకాణాల్లో అమ్మే పచ్చళ్లను లొట్టలేసుకుంటూ తింటున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. వరంగల్ నగరంలోని కాశిబుగ్గ ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ప్రాణాంతక నకిలీ పచ్చళ్ల తయారీ కేంద్రం గుట్టు రట్టుచేశారు పోలీసులు, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది. ఎటువంటి అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఓ రేకుల షెడ్‌లో నిర్వహిస్తున్న ఈ కేంద్రంపై మంగళవారం దాడులు చేసి భారీ ఎత్తున పచ్చళ్లను సీజ్ చేశారు. ఈ కేంద్రంలో ప్లాస్టిక్ డ్రమ్ములలో నిల్వ ఉంచిన మామిడి, టమాటా, ఉసిరి, నిమ్మకాయ, అల్లం వెల్లుల్లి పచ్చళ్లను చూసి ఫుడ్ సేఫ్టీ అధికారులే నివ్వెరపోయారు. ఏడాది కాలానికి సరిపడా ముడిసరుకును ముందే తెచ్చి నిల్వ చేయడంతో అవన్నీ దుర్వాసన వస్తూ, పైభాగంలో బూజుపట్టి అపరిశుభ్రంగా మారాయి. ఈ కుళ్లిన పచ్చళ్లు ఎక్కువ కాలం మన్నికగా ఉండటానికి, రంగు మారకుండా ఉండటానికి విపరీతంగా వెనిగర్, రసాయన పౌడర్లను వాడుతున్నారు. వీటిని చిన్న చిన్న డబ్బాల్లో నింపి, ఆకర్షణీయమైన బ్రాండ్ల పేర్లు తగిలించి నగరంలోని కర్రీ పాయింట్లు, కిరాణా షాపులు, స్వీట్ హౌస్‌లకు సరఫరా చేస్తున్నారు. ముఖ్యంగా ఏనుమాముల మార్కెట్ పరిసర ప్రాంతాల్లో ఈ దందా జోరుగా సాగుతోంది. ఇలాంటి కల్తీ పచ్చళ్లను తింటే జీర్ణక్రియ దెబ్బతినడమే కాకుండా, తీవ్ర కాలేయ సంబంధిత వ్యాధులు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కేవలం ధనార్జనే ధ్యేయంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి కేటుగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వరంగల్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పదవీ విరమణకు ముందు రోజు పర్మినెంట్ ఉద్యోగం.. టీచర్‌కు వింత అనుభవం

మానవత్వం చాటుకున్న టీచర్‌ విద్యార్ధిని వీపుపై మోస్తూ 6 కి.మీ.

వాషింగ్ మెషిన్‌లో పసిపిల్లలు.. ఏడిస్తే చిత్రహింసలు..! డే కేర్ సెంటర్‌‌లో దారుణం

తిరుమల శ్రీవారి తొలి దర్శన భాగ్యం ఈయనకే !

గంటల తరబడి కూర్చునే డెస్క్‌ ఉద్యోగులకు హెచ్చరిక!

Follow Us