ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు!
జగిత్యాల జిల్లాలోని ప్రముఖ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో నకిలీ నోట్ల కలకలం రేగింది. హుండీ లెక్కింపు సమయంలో సుమారు రూ.2.50 లక్షల విలువైన నకిలీ రూ.500 నోట్లు బయటపడ్డాయి. గుర్తుతెలియని వ్యక్తులు వీటిని హుండీలో వేసినట్లు అధికారులు భావిస్తున్నారు. ఘటనపై గత నాలుగు ఐదు రోజుల సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. హుండీ లెక్కింపు పూర్తయ్యాక పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
భక్తుల కొంగు బంగారం, నిత్యం భక్తజనసందోహంతో కళకళలాడే జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో నకిలీ నోట్ల కలకలం రేగింది. భక్తితో స్వామివారికి కానుకలు సమర్పించే హుండీలో, సాక్షాత్తు ఆ ఆంజనేయస్వామినే మోసం చేసేలా గుర్తుతెలియని వ్యక్తులు డమ్మీ నోట్లు వేశారు. హుండీ లెక్కింపు సమయంలో సుమారు రూ.2.50 లక్షల విలువైన నకిలీ 500 రూపాయల నోట్లు బయటపడటంతో ఆలయ అధికారులు అవాక్కయ్యారు. దేవుడి గుడిలో ఇలా అపచారం జరగడం, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా కొందరు ఇలాంటి దుర్మార్గానికి పాల్పడటం తీవ్ర విస్మయానికి గురిచేస్తోంది. నిత్యం రద్దీగా ఉండే ఈ పుణ్యక్షేత్రంలో ఎవరో కావాలనే దేవుడిని కూడా మోసం చేయాలనే దుర్బుద్ధితో ఈ డమ్మీ నోట్లను హుండీలో వేసినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న అధికారులు, గత నాలుగు ఐదు రోజులకు సంబంధించిన సీసీటీవీ పుటేజ్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. హుండీ లెక్కింపు పూర్తయిన వెంటనే నిందితులపై పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయనున్నట్లు దేవస్థానం వర్గాలు తెలిపాయి. స్వామివారికే టోకరా వేసేలా నకిలీ నోట్లు వేసిన కిలాడీల ఆట కట్టించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. దేవుడి పట్ల భక్తి లేకుండా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న వారికి చట్టపరంగా కఠిన శిక్షలు పడాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మీ ఇంట సిరులు కురిపించే మొక్క! ఈ రోజులు, దిశలో నాటాలి గుర్తుంచుకోండి
వాహనదారులకు షాక్.. వితంతువులు, అనాథల పేరుతో కొత్త సెస్!
ఆర్థిక సలహాల కోసం ఏఐని వాడుతున్నారా? అయితే ఈ డేంజర్ బెల్స్ మోగినట్టే!
వర్షం వస్తే చాలు డబ్బే.. డబ్బు.. ఈ ఊరిలో కన్నీటిని మరిపించే అద్భుతం!
స్పోర్ట్స్ బ్యాగు తెరిచిన యువకుడు.. లోపలున్నది చూసి పరుగో పరుగు!
