మర్రిచెట్టు తొర్రలో.. రూ.15 లక్షలు!
గుంటూరు జిల్లా మంగళగిరిలో పోలీసులమంటూ బెదిరించి రూ.15 లక్షలు దోచుకున్న ముగ్గురు నిందితులను పోలీసులు గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేశారు. స్టీల్ కంపెనీ అకౌంటెంట్ రఫీ విజయవాడకు నగదు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో అడ్డగించి బ్యాగ్, మూడు సెల్ఫోన్లు లాక్కెళ్లారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు, చినకాకాని సమీపంలోని మర్రిచెట్టు తొర్రలో దాచిన నగదును స్వాధీనం చేసుకున్నారు.
గుంటూరు జిల్లా మంగళగిరి ప్రాంతంలో సంచలనం సృష్టించిన రూ. 15 లక్షల దోపిడీ కేసును పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. తాము పోలీసులమని చెప్పి బెదిరింపులకు దిగి, వ్యాపారి సొమ్మును దోచుకెళ్లిన ముగ్గురు నిందితులను మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరుకు చెందిన ఒక స్టీల్ కంపెనీలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న రఫీ అనే వ్యక్తి నిన్న సాయంత్రం కంపెనీకి చెందిన రూ. 15 లక్షల నగదును బ్యాగ్‌లో పెట్టుకుని బైక్‌పై విజయవాడ బయలుదేరాడు. మార్గమధ్యలో షేక్ జానీ, షేక్ సురాజ్, షేక్ నాగూర్ అనే ముగ్గురు వ్యక్తులు ఆయనను అడ్డుకున్నారు. తాము పోలీసులమని చెప్పి రఫీని తీవ్రంగా బెదిరించారు. అనంతరం ఆయన వద్ద ఉన్న రూ. 15 లక్షల నగదు ఉన్న బ్యాగ్‌తో పాటు మూడు సెల్ఫోన్లను లాక్కుని అక్కడ నుంచి పారిపోయారు. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు రఫీ వెంటనే మంగళగిరి రూరల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలంలోని, ప్రధాన రహదారిపై ఉన్న సిసిటివి కెమెరా విజువల్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. విజువల్స్ ఆధారంగా నిందితులను పక్కాగా గుర్తించారు. నిందితులు దోచుకున్న నగదును చిన్న కాకాని రాజ్‌కమల్ రోడ్డు మార్గంలోని ఒక మర్రి చెట్టు తొర్రలో దాచినట్లు పోలీసులు విచారణలో కనుగొన్నారు. సిసిటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరిపారు. నిందితుల నుంచి దోపిడీకి గురైన సొమ్మును స్వాధీనం చేసుకుని, ఈ రోజు సాయంత్రం ముగ్గురినీ అరెస్ట్ చేసినట్లు నార్త్ డిఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. కేసును గంటల వ్యవధిలోనే ఛేదించిన మంగళగిరి రూరల్ పోలీసులను పలువురు అభినందించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాత్రూంలో జారిపడి.. ఎవరూ పట్టించుకోకపోవడంతో.. స్టార్ డైరెక్టర్ కన్నుమూత
Abhishek Sharma: టీమిండియా కొత్త కెప్టెన్ గా అభిషేక్ శర్మ.. కానీ ఓ కండీషన్
రాధిక సహాయకురాలి కొడుకు దారుణ హత్య..బీచ్‌లో పాతిపెట్టిన స్నేహితులు
Dorothy: డోరతి ఒరిజినల్ క్లైమాక్స్ ఇదే..లీక్ చేసిన కార్తీక్ సుబ్బరాజు!