గుడిలోకి వెళ్లి భక్తితో దణ్ణం పెట్టాడు.. ఆ తర్వాత..!
పుణేలో ఓ దొంగ ఆలయంలో భక్తుడిలా ప్రవేశించి అమ్మవారికి పూజలు చేసిన తర్వాత కిలో వెండి కిరీటాన్ని చోరీ చేసిన ఘటన వైరల్‌గా మారింది. చేతులు జోడించి క్షమాపణలు కోరుకున్నట్లు నటించిన అతడు, పూజారి దృష్టి మళ్లిన వెంటనే కిరీటాన్ని అపహరించాడు. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డ్ కాగా, ప్రస్తుతం పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
దొంగతనాల్లో ఎన్నో రకాలు చూసుంటాం.. కానీ మహారాష్ట్రలోని పుణేలో జరిగిన ఈ చోరీ మాత్రం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. గుడిలో దొంగతనం చేస్తూ కూడా తన ‘భక్తి’ని చాటుకున్నాడో కేటుగాడు. అమ్మవారికి చేతులు జోడించి, మొక్కి, క్షమాపణలు కోరుకుంటూనే కిలో బరువున్న వెండి కిరీటాన్ని గుట్టుచప్పుడు కాకుండా మాయం చేశాడు. సదరు దొంగ చేతిలో కొబ్బరికాయ పట్టుకుని, పక్కా భక్తుడిలా ఆలయంలోకి ప్రవేశించాడు. గర్భగుడి వద్దకు వెళ్లి అమ్మవారికి కుంకుమ పెట్టి, ఎంతో నిష్ఠగా పూజలు చేశాడు. అయితే, చోరీ చేయడానికి సరిగ్గా కొన్ని సెకన్ల ముందు దేవుడి వైపు చూస్తూ రెండు చేతులూ జోడించి, ఏదో వేడుకుంటున్నట్లు నటించాడు ఆ తర్వాత పూజారి దృష్టి మళ్లిన కొద్ది నిమిషాల్లోనే తన చేతివాటం ప్రదర్శించాడు. అమ్మవారి తలపై ఉన్న కిలో వెండి కిరీటాన్ని క్షణాల్లో నొక్కేసి అక్కడి నుంచి జారుకున్నాడు. ఈ విచిత్ర చోరీకి సంబంధించిన దృశ్యాలన్నీ ఆలయంలోని సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, నిందితుడు పక్కా ప్లాన్‌తో ముఖానికి మాస్క్, తలపై టోపీ ధరించి రావడంతో అతని ముఖాన్ని గుర్తించడం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. రంగంలోకి దిగిన పుణే పోలీసులు సీసీటీవీ విజువల్స్ ఆధారంగా ఈ ‘భక్త’ దొంగ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూ.100 మ్యాగీ, ఓ కూల్ డ్రింక్ బాటిల్..బాలుడి బర్త్‌డే వేడుకలు వైరల్
