Woman Viral: ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ చూస్తే షాకే.!
ఢిల్లీలో ఓ మహిళ బికినీ ధరించి రద్దీగా ఉన్న బస్సు ఎక్కిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె డ్రెస్ ను చూసి అవాక్కయిన కొందరు ప్రయాణికుల స్పందన సైతం వీడియోలో రికార్డయింది. ఈ ఘటనపై నెటిజన్ల నుంచి భిన్న స్పందన వ్యక్తమవుతోంది. బికినీలో మహిళను చూసి షాక్ కు గురయ్యామని కొందరు పేర్కన్నారు. ఆమె తీరును అభ్యతరకరంగా అభివర్ణించారు.
ఢిల్లీలో ఓ మహిళ బికినీ ధరించి రద్దీగా ఉన్న బస్సు ఎక్కిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె డ్రెస్ ను చూసి అవాక్కయిన కొందరు ప్రయాణికుల స్పందన సైతం వీడియోలో రికార్డయింది. ఈ ఘటనపై నెటిజన్ల నుంచి భిన్న స్పందన వ్యక్తమవుతోంది. బికినీలో మహిళను చూసి షాక్ కు గురయ్యామని కొందరు పేర్కన్నారు. ఆమె తీరును అభ్యతరకరంగా అభివర్ణించారు. మరికొందరు ఆ మహిళకు అండగా నిలబడ్డారు. ఆమె ఎలాంటి దుస్తులు ధరించాలో ఆమె ఇష్టమని వ్యాఖ్యానించారు. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ లో బుధవారం ఇందుకు సంబంధించిన వీడియో దర్శనమిచ్చింది. ఆ వీడియోలో ఓ మహిళ టూపీస్ బికినీలో బస్సెక్కడం కనిపించింది. అప్పటికే అక్కడ నిలబడి ఉన్న ఓ వృద్ధురాలు పక్కకు వెళ్లిపోగా సీట్లో కూర్చున్న ఓ ప్రయాణికుడు సైతం లేచి వెళ్లిపోయాడు.
వీడియో కింద భారీ సంఖ్యలో కామెంట్లు వచ్చాయి. ట్రెండ్ కు తగ్గట్లుగా ఆమె ఉందామనుకున్నట్లు కనిపిస్తోందని ఓ యూజర్ కామెంట్ చేయగా మరొకరేమో ఇదేం ఖర్మ.. ఎందుకిలా? అని స్పందించాడు. “అది ఆమె శరీరం.. ఆమె ఇష్టం. ఆమె మానాన ఆమెను వదిలేయండి” అంటూ మరొకరు వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏవైనా చర్యలు తీసుకుంటే బాగుంటుందని కొందరు యూజర్లు అభిప్రాయపడ్డారు. అయితే ఈ ఘటనపై అధికారులు ఇంకా స్పందించలేదు. గతంలో ఢిల్లీ మెట్రో రైల్లోనూ ఓ మహిళ బ్రా, మినీ స్కర్ట్ తో ప్రయాణించి కలకలం రేపింది. అప్పట్లో ఈ ఉదంతంపై ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ స్పందించింది. రైలు ప్రయాణికులు సామాజిక పద్ధతులను ఫాలో కావాలని కోరింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!