అత్తను ఈడ్చి ఈడ్చి కొట్టిన కోడలు.. ఏం జరిగిందంటే..!

Updated on: Apr 10, 2025 | 3:10 PM

మీకు సీరియల్స్ చూసే అలవాటు ఉందా? ఆ సీరియల్స్ లో ఇంటా బయటా ఆధిపత్యం కోసం.. ఒకరిపై మరొకరు కుట్రలు పన్నే అత్తాకోడళ్లు కనిపిస్తారు. ఆ సీరియల్స్ చూస్తున్నంతసేపూ.. బాబోయ్.. ఇలాంటి అత్తలూ, కోడళ్లూ ఉంటారా అనిపిస్తుంది. కానీ సమాజంలో అక్కడక్కడా ఈ రెండు క్యారెక్టర్లూ కనిపిస్తుంటాయి. ఇప్పుడు నేను మీకు అత్త పాత్ర గురించి చెప్పడం లేదు.

ఆ అత్తనే దారుణంగా కొట్టిన కోడలి గురించి చెబుతాను. ఈ స్టోరీ చూశాక.. ఇలాంటి కోడలు కూడా ఉంటుందా అని ఆశ్చర్యపోతారు. పాపం ఆ అత్తగారు అని ఫీలవుతారు. ఈ మొత్తం స్టోరీలో అటు తల్లిని కాపాడుకోలేక, ఇటు భార్యకు సర్దిచెప్పలేకపోయిన ఆ భర్తను చూసి జాలిపడతారు. అలాంటి ఓ ఫ్యామిలీ డ్రామా స్టోరీ ఇది. ఈ రియల్ స్టోరీ ఎక్కడ జరిగిందో కూడా చెబుతాను. సమాజంలో రోజు రోజుకూ మనుషుల్లో మానవత్వం కరువైపోతోంది.. బంధుత్వాలు మంటకలిసిపోతున్నాయి. అమ్మలా ఆత్మీయతను పంచాల్సిన మహిళల్లో కొందరు కర్కశంగా మారుతున్నారు. అందుకు ఉదాహరణగా ఇటీవల అనేక ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కన్నతల్లిదండ్రులే పిల్లలను చంపేస్తున్నారు. తాజాగా ఓ కోడలు.. తన అత్త వృద్ధాశ్రమానికి వెళ్లడానికి నిరాకరించడంతో… ఆమెను ఈడ్చి ఈడ్చి కొట్టింది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ అమానుష ఘ‌ట‌న మ‌ధ్యప్రదేశ్‌లోని గ్వాలియ‌ర్‌లో జరిగింది. గ్వాలియర్‌లోని ఆదర్శ్ కాలనీకి చెందిన నీలిక తన అత్త సరళాబాత్రాను వృద్ధాశ్రమానికి పంపాలనుకుంది. అదే విషయం భర్త విశాల్ బాత్రాకు చెప్పడంతో ఆయన ఒప్పుకోలేదు. తన తల్లిని వృద్ధాశ్రమానికి పంపేది లేదని తెగేసి చెప్పాడు. దాంతో పంపాల్సిందేనని భర్తతో గొడవకు దిగింది. అంతటితో ఆగకుండా విష‌యాన్ని నీలిక త‌న పుట్టింటివారికి చెప్పింది. దాంతో ఏప్రిల్‌ 1న నీలిక ఇంటికి.. కొంతమంది గూండాలతో కలిసి వచ్చాడు ఆమె తండ్రి. రావడంతోనే అల్లుడు అల్లుడు విశాల్ బాత్రా పై చేయిచేసుకున్నాడు. ఆయన తీసుకొచ్చిన గూండాలు కూడా విశాల్‌ బాత్రాను కొట్టారు. ఇదే అదునుగా భావించిన నీలిక త‌న అత్తను కింద‌ప‌డేసి ఘోరంగా కొట్టింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాలు ఆ ఇంట్లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మీరు మెనోపాజ్ స్టేజ్‌లో ఉన్నారా.. ఇది మీ కోసమే!

ఎగిరే ఉడుత కనిపించిందోచ్‌.. అంతరించిపోయింది అనుకుంటే..

ICUలో అలేఖ్య చిట్టి.. కన్నీళ్లతో వేడుకుంటూ అక్కాచెల్లి వీడియో

ఉద్యోగం రాలేదని లింక్డ్ఇన్‌లో ‘రెస్ట్ ఇన్ పీస్’ పోస్ట్