ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
జోగులాంబ గద్వాల జిల్లాలోని బీచుపల్లి పుష్కర ఘాట్ వద్దకు ఓ మొసలి రావడంతో భక్తులు, సందర్శకులు భయాందోళనకు గురయ్యారు. నది నుంచి బయటకు వచ్చిన మొసలి ఓ భవనంలోకి వెళ్లింది. అయితే పుష్కర ఘాట్ పురోహితుడు అనిల్ శర్మ దాని ముందు కూర్చొని పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు చేశారు. అనంతరం పోలీసులు, అటవీశాఖ అధికారులు మొసలిని సురక్షితంగా పట్టుకుని కృష్ణా నదిలో విడిచిపెట్టారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
జోగులాంబ గద్వాల జిల్లాలోని బీచుపల్లి కృష్ణా నది పుష్కర ఘాట్ వద్ద ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నదిలో ఉండాల్సిన మొసలి పుష్కర ఘాట్ సమీపానికి రావడం భయాందోళనకు గురిచేసింది. పుష్కర ఘాట్ కు వచ్చిన వారు మొసలిని చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరిని ఆశ్చర్యానికి గురిచేశాయి. ఆదివారం, వరుస సెలవులు కావడంతో బీచుపల్లి కృష్ణా నది పుష్కర ఘాట్ కు సందర్శకులు, భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. నది ఓడ్డున ఉన్న ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకుని… పక్కనే కృష్ణమ్మ పరవళ్లను తిలకిస్తున్నారు. ఇంతలోనే ఓ మొసలి నదిలో నుంచి పుష్కర్ ఘాట్ పైకి వచ్చింది. అది చూసిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఆ మొసలి నేరుగా ఓ భవనంలోకి వచ్చింది. విషయం తెలుసుకున్న పుష్కర ఘాట్ పురోహితుడు అనిల్ శర్మ అక్కడికి చేకుని, మొసలి ముందు కూర్చొని మంత్రాలు జపిస్తూ పూజలు చేయడం ప్రారంభించాడు. పసుపు, కుంకుమ, పుష్పాలతో అర్చన చేశాడు. మొసలి వరుణ దేవుడి వాహనమని అనిల్ శర్మ తెలిపారు. సమృద్ధిగా వర్షాలు కురవాలని పాడి, పంటలతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ పూజలు చేసినట్లు ఆయన తెలిపారు. సాధారణంగా మొసలిని దగ్గరగా చూస్తేనే ఎవరైనా భయపడారు. అలాంటిది అనిల్ శర్మ ఏమాత్రం భయాందోళన చెందకుండా మొసలికి సమీపంలో ఎదురుగా కూర్చొని చాలా సేపు పూజలు చేశారు. ఈ క్రమంలో మొసలి మౌనంగా, ప్రశాంతంగా కదలకుండా అలానే ఉండిపోయింది. ఈ సీన్ మొత్తం కొందరు వీడియో తీసారు. అనంతరం స్థానిక పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేశారు. వెంటనే పుష్కర ఘాట్ కు చేరుకున్న పోలీసులు, అటవీ సిబ్బంది… మొసలిని సురక్షితంగా బంధించి నదిలో విడిచిపెట్టారు. దీంతో స్థానికులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రేషన్ షాపులో బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. పరిశీలించి షాక్ తిన్న యజమాని
