గోమాత మాతృ హృదయం.. మేకపిల్ల ఆకలి తీర్చి..

Updated on: Feb 23, 2026 | 6:43 PM

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన ఓ హృదయవిదారక ఘటనలో, ఆకలితో అలమటిస్తున్న మేకపిల్లకు ఒక ఆవు పాలిచ్చి తన మాతృప్రేమను చాటుకుంది. తల్లి లేకుండా తిరుగుతున్న ఆ మేకపిల్ల పశువుల కొట్టంలోకి వెళ్లి ఆవు పొదుగును పట్టుకుంది. ఆ ఆవు జాతిభేదం చూపకుండా, ఆ చిన్నారి ఆకలి తీర్చింది. ఈ ఘటన స్థానికులను కదిలించి, అమ్మతనం జాతికి అతీతమని మరోసారి నిరూపించింది. అందుకే ఆవును గోమాత అన్నారు.

మాతృ హృదయానికి తన, పర అనే భేదం ఉండదు.. అది మనుషులైనా.. పశుపక్ష్యాదులైనా. అందుకు ఉదాహరణే ఈ ఘటన. సాధారణంగా ఏ బిడ్డ ఆకలితో ఏడుస్తున్నా ఏతల్లీ చూస్తూ ఊరుకోలేదు. వెంటనే ఏదొక ఆహారం పెట్టి ఆ చిన్నారి ఆకలి తీరుస్తుంది. అలాగే ఓ ఆవు ఆకలితో అలమటిస్తున్న ఓ చిన్ని మేకపిల్ల ఆకలి తీర్చి అమ్మతనాన్ని చాటుకుంది. ఇందుకేనేమో ఆవును గోమాత అన్నారు. ఈ ఘటన కొమురంభీం జిల్లాలో జరిగింది. కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ టి మండలం ఇటిక్యాలలో ఓ చిన్ని మేక పిల్ల ఆకలితో అలమటిస్తూ.. తన తల్లికోసం వెతుక్కుంటోంది. ఆ మేక పిల్ల తల్లి మందతో కలిసి మేతకే వెళ్లిందో.. లేక తల్లి లేదో తెలియదు కానీ ఈ చిన్నారి మేకపిల్ల ఆకలితో అరుస్తూ అటూ ఇటూ తిరుగుతోంది. అలా తిరుగుతూ అక్కడే ఉన్న పశువుల కొట్టాంలోకి వెళ్లింది. అక్కడ ఆవు పొదుగును చూడగానే పరుగెత్తుకెళ్లి పాలు తాగడం మొదలు పెట్టింది. ఆ ఆవుకూడా మేకపిల్లను ఏమీ అనకుండా చక్కగా పాలిచ్చి దాని కడుపు నింపింది. ఈ ఘటన స్థానికులను కదిలించింది. జాతిభేదం చూపకుండా తల్లిప్రేమను చాటుకున్న ఆవు మాతృహృదయానికి అందరూ ఫిదా అయ్యారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మంత్రగత్తె అనుమానంతో.. మహిళకు నిప్పంటించిన మూక

వామ్మో.. రెండు తలల పాము.. బెంబేలెత్తిన జనం

Uday Kiran: ఆ సినిమా రిలీజ్ అయి ఉంటే.. ఉదయ్‌ లెవలే వేరేగా ఉండు

ఇటు సినిమాలు.. అటు బిజినెస్.. మనోళ్లు అస్సలు తగ్గట్లేదుగా..!

రజినీ, కమల్ మల్టీస్టారర్.. మరి వీరిలో హీరో ఎవరో తెలుసా..?

Follow Us