రెండేళ్లకే ప్రపంచ రికార్డు.. ఈ బుడ్డోడి ట్యాలెంట్ మామూలుగా లేదుగా వీడియో
మాటలు కూడా ఇంకా పూర్తిగా రాని వయసులో ఓ రెండేళ్ల బాలుడు తన అద్భుతమైన జ్ఞాపకశక్తితో ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు. కేవలం 41 సెకన్లలో మన దేశంలోని 29 రాష్ట్రాల రాజధానుల పేర్లను చకచకా చెప్పి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఈ చిన్నారి ప్రతిభకు గుర్తింపుగా ‘వరల్డ్‌వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కింది.
నిజామాబాద్‌లోని సీతరాంనగర్ కాలనీలో నివసించే రవికుమార్, అమూల్య దంపతుల కుమారుడు రెంజర్లవార్ వియాన్ఈ ఘనతను సాధించాడు. వియాన్ తండ్రి రవికుమార్ ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తుండగా, తల్లి అమూల్య గృహిణి. ఎల్లారెడ్డి మాజీ ఎంపీపీ నక్క గంగాధర్ మనవడే ఈ వియాన్. వియాన్‌కు ఏడాది వయసు ఉన్నప్పటి నుంచే తల్లి అమూల్య రాష్ట్రాల రాజధానుల పేర్లను సరదాగా నేర్పించడం ప్రారంభించారు. తల్లి ప్రోత్సాహంతో ఆ బాలుడు అనతికాలంలోనే అన్ని రాష్ట్రాల రాజధానులను గుర్తుపెట్టుకుని, ఎవరు అడిగినా తడుముకోకుండా చెప్పే స్థాయికి చేరుకున్నాడు. ఈ చిన్నారి ప్రతిభ గురించి తెలుసుకున్న ‘వరల్డ్‌వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ సంస్థ ప్రతినిధులు మే నెలలో నిజామాబాద్‌కు స్వయంగా వచ్చారు. వియాన్ ప్రతిభను ప్రత్యక్షంగా పరీక్షించి ఆశ్చర్యపోయారు. వారి ఎదుట కేవలం 41 సెకన్లలోనే 29 రాజధానుల పేర్లను బాలుడు చెప్పడంతో వారు రికార్డుకు ఎంపిక చేశారు.
మరిన్నివీడియోల కోసం :
ఫ్యాన్స్‌కు రష్మిక అదిరిపోయే ఆఫర్..ఆ ఒక్కపని చేస్తే లుస్తానంటూ పోస్ట్
డబ్బుల కోసం పోస్టాఫీసుకి పోతే.. పాస్‌బుక్‌పై ఉన్నది చూడగా వీడియో
చిరుతలనే పరుగులు పెట్టించిన ఎద్దు వీడియో వైరల్
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

