జూలో ఫుడ్ పెట్టిన చిన్నారిపై సింహం దాడి.. వైరల్ వీడియో

Updated on: Mar 18, 2026 | 5:18 PM

చైనాలోని జూలో 10 ఏళ్ల చిన్నారిపై సింహం దాడి తీవ్ర కలకలం రేపింది. ఆహారం తినిపించే ప్రయత్నంలో సింహం బాలిక కాలు పట్టుకుంది. అదృష్టవశాత్తు జూ సిబ్బంది వెంటనే స్పందించి చిన్నారిని రక్షించారు. ఈ భయంకర దృశ్యాలు వైరల్‌గా మారాయి. బంధించిన జంతువులలో ఒత్తిడి పెరిగి అసహజ ప్రవర్తన కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ప్రమాదాల నివారణకు జూలు తగిన జాగ్రత్తలు పాటించాలి.

చైనాలోని ఓ జూలో 10 ఏళ్ల చిన్నారిపై సింహం దాడి చేసింది. సింహానికి ఆహారం తినిపించేందుకు ప్రయత్నించగా, అది ఒక్కసారిగా పంజా విసిరింది. బోను ఊచల సందు నుంచి చిన్నారి కాలును పట్టుకుని లోపలికి లాగేందుకు ప్రయత్నించడంతో జూ సందర్శకులు తీవ్రంగా భయపడ్డారు. అదృష్టవశాత్తూ సిబ్బంది వెంటనే స్పందించి చిన్నారిని కాపాడారు. ఆ భయంకర దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చైనాలోని షాంటౌ జోంగ్షాన్ పార్క్ జూలో ఎన్‌క్లోజర్ వెనుక ఉన్న మూడు సింహాలకు మాంసం ఆహారంగా వేయడానికి చిన్నారిని అనుమతించాడు జూకీపర్. సింహానికి ఆహారం తినిపించేందుకు ప్రయత్నించగా, అది ఒక్కసారిగా పంజా విసిరింది. కొన్ని సెకన్లలోనే, ఒక సింహం బోను ఊచల నుంచి చేయి బయటకు పోనిచ్చి చిన్నారిని పట్టుకుంది. చిన్నారి భయంతో కేకలు వేస్తుండగా అప్రమత్తమైన సిబ్బంది ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. చివరకు సింహం చిన్నారిని విడిచిపెట్టింది. దాడిలో చిన్నారి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నప్పటికీ, అదృష్టవశాత్తూ ఆ పాప కాళ్లకు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. చిన్నారి చేతిలో ఉన్న మాంసాన్ని పట్టుకునే ప్రయత్నంలోనే సింహం దాడి చేసినట్టు భావిస్తున్నారు. ఈ ఘటనపై జూ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇది పూర్తిగా నివారించదగ్గ ప్రమాదమని జూ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. పార్క్ తిలకించేందుకు వచ్చేవారికి తగిన జాగ్రత్తలు తెలియచేస్తామని తెలిపారు. అడవుల్లో తమ సహజ వాతావరణంలో సింహాలు ప్రతిరోజూ మైళ్ళ కొద్దీ సంచరిస్తాయి, ఆహారం కోసం వేటాడతాయి. కానీ వాటిని జూలో బంధించినప్పుడు, వాటి సహజ జీవన విధానానికి పూర్తి భిన్నంగా జీవించాల్సిన పరిస్థితుల్లో .. ఆ నిర్బంధ జీవితం కారణంగా వాటిలో తీవ్రమైన ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు రావచ్చనీ దాని ఫలితంగా ఆగ్రహం పెరిగి హింసాత్మకంగా మారడం వంటి అసహజ ప్రవర్తన కలిగి ఉంటాయని జంతు సంబంధ నిపుణులు హెచ్చరించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గ్యాస్ వినియోగదారులకు బిగ్‌ రిలీఫ్‌.. ఈ విధంగా చేయండి

పాపం.. గోల్డ్‌ అనుకొని స్కెచ్‌ వేశారు.. చివరికి..

ఏటీఎంలో చోరీకి విఫల యత్నం.. చివరికి ఇలా..

పట్టపగలు దారుణం.. స్కూటీ డిక్కీ పగలగొట్టి నిమిషాల్లోనే

TTD: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. జూన్‌ దర్శనం టికెట్ల కోటా విడుదల

Follow Us