ఈ చిన్నారి చిచ్చరపిడుగు.. ఏకంగా విమానాన్నే రద్దు చేయించింది!

Updated on: Aug 14, 2026 | 6:05 PM

కెనడాలో ఓ చిన్నారి సీటు బెల్టు ధరించేందుకు నిరాకరించడంతో విమాన సర్వీసు రద్దయింది. విక్టోరియా నుంచి టొరంటోకు బయలుదేరిన పోర్టర్ ఎయిర్‌లైన్స్‌ విమానాన్ని భద్రతా కారణాలతో టెర్మినల్‌కు తీసుకొచ్చారు. చిన్నారి కుటుంబాన్ని విమానం నుంచి దించడంలో ఆలస్యం కావడంతో అర్ధరాత్రి దాటిపోయింది. దీంతో విమానాశ్రయం రన్‌వే మూసివేయడంతో 132 మంది ప్రయాణికులు రాత్రంతా అక్కడే ఉండాల్సి వచ్చింది. మరుసటి రోజు వారిని మరో విమానంలో టొరంటోకు తరలించారు.

కెనడాలో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఒక చిన్నారి సీటు బెల్టు ధరించేందుకు నిరాకరించడంతో, ఏకంగా విమాన సర్వీసునే రద్దు చేయాల్సి వచ్చింది. భద్రతా నిబంధనలతో విమానం నిలిచిపోవడంతో తోటి ప్రయాణికులందరూ రాత్రంతా విమానాశ్రయంలోనే తీవ్ర అవస్థలు పడ్డారు. పోర్టర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం విక్టోరియా నుంచి టొరంటోకు బయలుదేరేందుకు సిద్ధమైంది. విమానం రన్‌వే వైపు వెళుతుండగా, ఒక చిన్నారి సీటుపై నిలబడి ఉండటాన్ని సిబ్బంది గమనించారు. తల్లిదండ్రులు, సిబ్బంది ఎంత నచ్చజెప్పినా ఆ పాప కూర్చుని బెల్టు ధరించేందుకు అంగీకరించలేదు. భద్రతా కారణాల రీత్యా పైలట్లు విమానాన్ని తిరిగి టెర్మినల్‌కు తీసుకెళ్లారు. ఆ చిన్నారి కుటుంబాన్ని లగేజీతో సహా కిందకు దించే క్రమంలో తీవ్ర జాప్యం జరిగింది. ఇంతలో సమయం రాత్రి 12:30 దాటింది. విక్టోరియా విమానాశ్రయంలో రాత్రి 12:30 గంటల తర్వాత రన్‌వే మూసివేస్తారు. దీంతో విమాన సర్వీసును రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో 132 మంది ప్రయాణికులు రాత్రంతా విమానాశ్రయంలోనే గడపాల్సి వచ్చింది. చిన్నారి ప్రయాణ భయం వల్లే అలా ప్రవర్తించి ఉండవచ్చని ప్రయాణికులు తెలిపారు. ఈ అసౌకర్యానికి క్షమాపణలు కోరిన ఎయిర్‌లైన్స్ యాజమాన్యం, మరుసటి రోజు ఉదయం ప్రయాణికులను వేరే విమానంలో టొరంటోకు చేర్చింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కడుపు నిండా తింటూనే బరువు తగ్గొచ్చు.. ట్రెండింగ్‌లో ‘వాల్యూమెట్రిక్స్‌ డైట్’!

భోజనం చేసిన వెంటనే పండ్లు తినొచ్చా? నిపుణులు చెబుతున్న అసలు నిజం ఇదే!

Gen Z ప్రేమలో వినిపించే ఈ డేటింగ్ పదాల అసలు అర్థాలివే!

Published on: Aug 14, 2026 04:45 PM
Loading...
Unable to load recommendations.
Follow Us