Chidambaram Temple: చిదంబర ఆలయ సంపద మాదే.. ప్రభుత్వానికి హక్కులేదు.. దీక్షిత వర్గం.
తమిళనాడులోని ప్రముఖ శైవ క్షేత్రం నటరాజ స్వామి కొలువైన చిదంబరం. తాజాగా చిదంబర ఆలయ సంపద వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. ఆలయ సంపద ఫై పూర్తి వివరాలను వెల్లడించాలని దీక్షితులు
తమిళనాడులోని ప్రముఖ శైవ క్షేత్రం నటరాజ స్వామి కొలువైన చిదంబరం. తాజాగా చిదంబర ఆలయ సంపద వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. ఆలయ సంపద ఫై పూర్తి వివరాలను వెల్లడించాలని దీక్షితులు వర్గానికి ఆ రాష్ట్ర హిందూ మత, ధర్మాదాయ HR and CE ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు చిదంబరం నటరాజ ఆలయానికి సంబంధించిన ఖాతాల వివరాలను తమ వద్ద ఉంచాలని కోరుతూ వారికి నోటీసులు పంపింది. ఆలయ ఆస్తుల వివరాలను జూన్ 7 , 8 తేదీల్లో తెలిపాలని పేర్కొంది.అయితే ఆదాయం , ఖర్చుకి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పాలని నోటీసులను పంపించడంపై దీక్షితుల వర్గం తప్పుపడుతున్నాయి. నటరాజస్వామి ఆలయ సంపద ఫై రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి అధికారం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 2014 సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు ప్రకారం ఆలయానికి సంబంధించిన పూర్తి హక్కులు దీక్షితులవేనని చెబుతున్నారు. దేవాదాయ శాఖ ఉత్తర్వులను ఖండిస్తూ రాష్ట్రపతి , ప్రధానికి, రాష్ట్ర గవర్నర్ కి ఆలయ దీక్షితులు ఇప్పటికే ఓ లేఖ రాసినట్లు తెలుస్తోంది. నటరాజస్వామీ ఆలయం విషయం లో ప్రభుత్వ ప్రమేయాన్ని తాము ఒప్పుకోమని చెప్పారు. ఆలయ సంపద విషయంలో ప్రభుత్వంతో ఎంతటి పోరాటానికైనా తాము సిద్ధమంటూ దీక్షితుల వర్గం హెచ్చరికలు జారీ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!