Kolkata: వైద్యుల నిరసనల వేళ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కీలక ఆదేశాలు.!
కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. హాస్పిటల్స్ వద్ద సరైన భద్రత కల్పించాలంటూ దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళనల బాట పట్టారు. ఈ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న కేంద్ర హోం మంత్రిత్వశాఖ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. వైద్యుల నిరసనలకు సంబంధించి ప్రతి 2 గంటలకు ఒకసారి అన్ని రాష్ట్రాలు పరిస్థితిపై నివేదిక అందించాలని కోరింది.

కోల్‌కతా హత్యాచారం ఘటనకు నిరసనగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆందోళనల నేపథ్యంలో అక్కడ శాంతిభద్రతల పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని కేంద్రం కోరింది. ఫ్యాక్స్ లేదా ఈ-మెయిల్, వాట్సాప్ ద్వారా కేంద్ర హోంశాఖ కంట్రోల్ రూమ్‌కి సమాచారం అందించాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సంబంధిత రాష్ట్ర స్థాయి అధికారులకు కూడా కేంద్రం వివరాలు పంపించడం విశేషం.
వైద్యురాలిపై హత్యాచారం కేసులో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. విచారణకు మరోసారి రావాలంటూ ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఆయనను విచారణకు పిలవడం ఇది మూడవ సారి. ఘోష్‌ను ఇదివరకే ఆగస్టు 16 న 15 గంటలు, ఆగస్టు 17న 13 గంటలు సీబీఐ ప్రశ్నించింది. ఇక ఆదివారం ఉదయం 11 గంటలకు మళ్లీ హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ కేసులో ఘోష్‌పై సీబీఐ ఫోకస్ చేయడం ఆసక్తికరంగా మారింది. కాగా హత్యాచారం జరిగిన తర్వాత ఘోష్ ప్రతిస్పందన ఏమిటి? విషాదానికి సంబంధించి ఆమె కుటుంబానికి, అధికారులకు ఎవరు తెలియజేశారు? ఎలా తెలియజేశారు? వంటి విషయాలపై సీబీఐ ప్రధానంగా దృష్టి సారించింది. ఇక ఘోష్‌తో పాటు ఈ ఘటనకు సంబంధించి వైద్యులు, పోలీసు అధికారులు సహా 40 మందిని ప్రశ్నించాలని భావిస్తున్న సీబీఐ అధికారులు ఇప్పటికే 20 మందిని ప్రశ్నించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
రోడ్లు బాగు చేయాలంటూ రోడ్డుపై పొర్లు దండాలు
దూసుకెళ్తున్న ఎమ్మెల్యే కారు... ఆపిన పోలీసులు.. ఆ తర్వాత
విషాదం అంటే ఇదే... ఆ దాత నుంచి కిడ్నీ తీసుకున్న వారాలకే
‘దురంధర్’ పాటకు పాక్‌లో దుమ్మురేపేలా డాన్స్
గబ్బిలాలకు పూజలు చేసే గ్రామం.. ఎందుకో తెలుసా ??
200 ఏళ్ల నాటి అరుదైన శంఖం... ఏడాదికి ఒక్కసారే...
ప్రియుడి భార్య ఎంట్రీ..10వ అంతస్తు లో వేలాడిన ప్రియురాలు