వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్‌ టవర్లనే..

Updated on: Apr 12, 2026 | 8:11 PM

వరంగల్ పోలీసులు అంతర్ జిల్లా సెల్ టవర్ బ్యాటరీల దొంగల ముఠా గుట్టు రట్టు చేశారు. మొదట చెరువుల్లో చేపలు దొంగిలించిన ఈ ముఠా, ఆదాయం చాలక సెల్ టవర్ బ్యాటరీలను లక్ష్యంగా చేసుకుంది. నల్గొండకు చెందిన ఐదుగురు నిందితులు పట్టుబడగా, 144 బ్యాటరీలు, రూ. 2.6 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. టెక్నాలజీ సాయంతో ఈ దొంగలను అరెస్ట్ చేశారు. జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.

దొంగలు రూటు మార్చారు. మొదట్లో చెరువుల్లో చేపలు దొంగిలించే ఈ ముఠా గిట్టుబాటు కావట్లేదని ఏకంగా సెల్‌ టవర్లపైన పడ్డారు. చేపల దొంగతనాలతో మొదలై.. సెల్ టవర్ బ్యాటరీల చోరీల వరకు ఎదిగిన ఈ అంతర్ జిల్లా దొంగల ముఠాను వరంగల్ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. జల్సాలకు అలవాటుపడి, సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఈ ముఠా వరుస చోరీలకు పాల్పడుతోంది. నిందితుల నుంచి సుమారు 144 బ్యాటరీలతో పాటు భారీగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన గణేష్, సుధాకర్, శివాజీ, నరసింహ, సురేష్‌లు ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీరంతా రాత్రి సమయాల్లో చెరువుల్లో చేపలు దొంగిలించేవారు. అయితే, ఆ ఆదాయం తమ జల్సాలకు సరిపోకపోవడంతో సెల్ టవర్లను లక్ష్యంగా చేసుకున్నారు. నిందితుల్లో కొందరికి టవర్ పనులపై అవగాహన ఉండటంతో, కొన్ని బ్యాటరీలను తొలగించినా టవర్ సిగ్నల్‌కు ఇబ్బంది కలగదనే విషయాన్ని గుర్తించి ఈ దారుణానికి ఒడిగట్టారు. చేపల దొంగతనం కోసం వెళ్ళినప్పుడే, పరిసరాల్లోని సెల్ టవర్లపై రెక్కీ నిర్వహించి అర్ధరాత్రి వేళల్లో బ్యాటరీలను మాయం చేసేవారు. నగర శివారుల్లోని టవర్ల వద్ద వరుసగా బ్యాటరీలు మాయమవుతుండటంతో రంగంలోకి దిగిన పోలీసులు, టెక్నాలజీ సాయంతో ముఠా గుట్టును రట్టు చేశారు. నిందితుల నుంచి దాదాపు రెండు లక్షల విలువైన 144 బ్యాటరీలు , రూ. 2.60 లక్షల నగదు, రెండు ట్రాలీలు, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన ఈ బ్యాటరీలను నిందితులు మహారాష్ట్రలోని గడ్చిరోలిలో విక్రయిస్తున్నట్టు గుర్తించారు. ఈ ముఠాపై ఇప్పటికే యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో పలు కేసులు ఉన్నాయి. మొత్తం 13 సెల్ టవర్లలో వీరు చోరీలకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. పట్టుబడిన ఐదుగురిని రిమాండ్‌కు తరలించగా, పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆటోలో 4.5 లక్షల నగలు మర్చిపోయిన మహిళ.. చివరికి..

అనారోగ్యం పాలైన భర్త.. బైక్‌ మెకానిక్‌గా మారిన భార్య

రోజూ నందీశ్వరుడికి ప్రదక్షిణలు చేస్తున్న నాగుపాము

Jailer 2: జైలర్‌2 లో పవన్‌.. ఇంతకీ నిజమేనా ??

వరికోత కోస్తున్న కూలీలు..దుబ్బుల మాటున ఉన్నది చూసి హడల్‌

Follow Us