జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
పిల్లి, కుక్క మధ్య సహజంగా శత్రుత్వం ఉంటుందని భావిస్తాం. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని బండి సుబ్రహ్మణ్య నగర్లో ఈ రెండు మూగజీవాలు ప్రాణ స్నేహితులుగా మారాయి. మౌలాలి ఇంట్లో ఉంటున్న పిల్లి, కుక్క ఎంతో అన్యోన్యంగా కలిసి ఆడుకుంటూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వీటి అరుదైన స్నేహాన్ని చూసేందుకు స్థానికులు ఆసక్తిగా వస్తున్నారు. మనుషులు కూడా పరస్పర ప్రేమ, సహనంతో మెలగాలని ఈ అనుబంధం సందేశమిస్తోంది.
సాధారణంగా పిల్లి, కుక్క మధ్య సహజంగానే శత్రుత్వం ఉంటుందని, అవి ఎప్పుడూ ఒకదానితో ఒకటి గొడవపడుతుంటాయని అందరూ భావిస్తుంటారు. కానీ, ఇందుకు భిన్నంగా ఆ రెండు మూగజీవాలు జాతి వైరాన్ని పూర్తిగా మరచి ప్రాణ స్నేహితులుగా మెలగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణంలోని బండి సుబ్రహ్మణ్య నగర్లో చోటుచేసుకున్న ఈ అరుదైన స్నేహం ఇప్పుడు స్థానికంగా అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. అశ్వారావుపేటలోని బండి సుబ్రహ్మణ్య నగర్లో నివాసం ఉంటున్న మౌలాలి ఇంట్లో పిల్లి, కుక్క ఎంతో అన్యోన్యంగా ఉంటున్నాయి. సాధారణంగా పాము-ముంగిస, పిల్లి-ఎలుక, పిల్లి-కుక్క వంటి జంతువుల మధ్య విరుద్ధ స్వభావం ఉంటుంది. కానీ, మౌలాలి ఇంట్లో మాత్రం ఈ రెండు జంతువులు ఎలాంటి భేదభావాలు లేకుండా కలిసి ఆడుకుంటూ, ఒకదానితో ఒకటి కలిసిమెలిసి ఉంటున్నాయి. ఈ ముద్దుల మూగజీవాల స్నేహాన్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు ఆసక్తిగా వస్తుంటారు. ప్రస్తుత కాలంలో మనుషుల మధ్య చిన్న చిన్న విషయాలకే విభేదాలు, వివాదాలు తలెత్తుతున్న సందర్భాలను చూస్తున్నాం. కానీ, ఎలాంటి స్వార్థం లేని మూగజీవాల మధ్య ఇలాంటి అనుబంధాలు ఏర్పడటం అందరినీ ఆలోచింపజేస్తోంది. జంతువులే జాతి వైరం మరచి కలిసి ఉంటున్నప్పుడు, మనుషులు కూడా పరస్పర గౌరవం, సహనం, స్నేహభావంతో మెలగాలని జంతుప్రేమికులు అభిప్రాయపడుతున్నారు. మౌలాలి ఇంట్లో పిల్లి, కుక్కల మధ్య నెలకొన్న ఈ సరికొత్త దోస్తీ ప్రస్తుతం ఆ ప్రాంతంలో హాట్ టాపిక్‌గా మారింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
