Calcutta High Court: శివలింగం తొలగించాలంటూ జడ్జి తీర్పు..ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
ఓ వివాదాస్పద స్థలం కేసులో జడ్జిమెంట్ ఇచ్చిన న్యాయమూర్తి వెంటనే ఆ తీర్పును వెనక్కి తీసుకున్నారు. అందుకు కారణం ఆ జడ్జిమెంట్‌ను నమోదు చేసుకుంటున్న అసిస్టెంట్ రిజిస్ట్రార్ అకస్మాత్తుగా మూర్ఛపోవడమే. ఇంతకీ ఆ జడ్జిగారు ఇచ్చిన తీర్పు ఏంటి? రిజిస్ట్రార్ ఎందుకు స్పృహ కోల్పోయాడంటే ఆ వివాదాస్పద స్థలంలో ఉన్న శివలింగాన్ని తొలగించాల్సిందిగా జడ్జి తీర్పు నిచ్చారు. ఆ తీర్పును నోట్ చేస్తుండగా సబ్ రిజిస్ట్రార్ పడిపోయాడు.
ఓ వివాదాస్పద స్థలం కేసులో జడ్జిమెంట్ ఇచ్చిన న్యాయమూర్తి వెంటనే ఆ తీర్పును వెనక్కి తీసుకున్నారు. అందుకు కారణం ఆ జడ్జిమెంట్‌ను నమోదు చేసుకుంటున్న అసిస్టెంట్ రిజిస్ట్రార్ అకస్మాత్తుగా మూర్ఛపోవడమే. ఇంతకీ ఆ జడ్జిగారు ఇచ్చిన తీర్పు ఏంటి? రిజిస్ట్రార్ ఎందుకు స్పృహ కోల్పోయాడంటే ఆ వివాదాస్పద స్థలంలో ఉన్న శివలింగాన్ని తొలగించాల్సిందిగా జడ్జి తీర్పు నిచ్చారు. ఆ తీర్పును నోట్ చేస్తుండగా సబ్ రిజిస్ట్రార్ పడిపోయాడు. దాంతో ఆందోళన చెందిన న్యాయమూర్తి తీర్పును వెనక్కి తీసుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పశ్చిమబెంగాల్‌కు చెందిన గోవింద్ మండల్, సుదీప్ పాల్ అనే వ్యక్తుల మధ్య ఓ స్థలం విషయంలో వివాదం తలెత్తింది. ఈ క్రమంలో వివాదాస్పద స్థలంలో అకస్మాత్తుగా శివలింగం కనిపించగా ఈ ఘటన వెనుక సుదీప్ మండల్ హస్తం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో గోవింద్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ గుప్తా ఇరు వర్గాల వాదనలూ విన్నారు. అనంతరం, శివలింగం తొలగించాలంటూ తీర్పు వెలువరించారు. అయితే, జడ్జిమెంట్‌ను నమోదుచేసుకుంటున్న అసిస్టెంట్ రిజిస్ట్రార్ అకస్మాత్తుగా మూర్ఛపోవడంతో కలకలం రేగింది. ఈ క్రమంలోనే న్యాయమూర్తి తన తీర్పును ఉపసంహరించుకున్నారు. అంతేకాకుండా, ఈ వివాదంపై హైకోర్టు కలుగజేసుకోదని, కింది కోర్టులో తేల్చుకోవాలని పిటిషనర్లకు సూచించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...