Bullet Rider: బైక్‌పై వెళ్తున్న దంపతులు.. ఉన్నట్టుండి భర్త చేసిన పనికి భార్య షాక్‌..! వీడియో వైరల్..

|

Nov 23, 2022 | 9:19 AM

సోషల్‌ మీడియాలో పాపులర్‌ అవ్వాలనే కోరికతో యువత రకరకాల స్టంట్స్‌ చేస్తూ ఆ వీడియోలను నెట్టింట పోస్ట్‌ చేస్తున్నారు. ఈ స్టంట్స్‌ కారణంగా వారే కాకుండా ఇతరులను కూడా ప్రమాదంలోకి నెడుతున్నారు.


ఈ వీడియోలో ఓ వ్యక్తి తన భార్యతో కలిసి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ పై ప్రయాణిస్తున్నాడు. ఆ బైక్ నడుపుతున్న వ్యక్తి మొదట మామూలుగానే బైక్‌ నడిపాడు. ఆ తర్వాత వేగం పెరిగిన కొద్దీ స్టంట్స్ చేయడం స్టార్ట్ చేశాడు. బైక్ హ్యాండిల్స్‌ వదిలేసి, సీటుపై నిలుచున్నాడు. కాగా బైక్‌ వేగంగా ముందుకు పోతోంది. వెనుక కూర్చున్న ఆ వ్యక్తి భార్య, ఉన్నట్టుండి భర్త చేసిన ఈ పనికి ఆశ్చర్యపోయింది… ఒకింత భయపడింది. చిన్న పొరపాటు జరిగినా దాని మూల్యం చెల్లించుకోక తప్పదనే విషయం ఆమెకు అర్థమైనట్లు తెలుస్తోంది. ఈ వీడియోను ఇన్ స్టా గ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోకు వేల సంఖ్యలో వ్యూస్, వందల సంఖ్యలో లైక్స్ వస్తున్నాయి. క్లిప్ చూసిన తర్వాత తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు. చిన్న పొరపాటు జరిగినా పెద్ద ప్రమాదం తప్పదని ఒకరు, ఆ మహిళ గుండె ధైర్యానికి మెచ్చుకోవాల్సిందేనని మరొకరు కామెంట్లు రాశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Dog saved cat: పిల్లిపిల్లను కాపాడేందుకు కుక్క ప్లాన్‌ అదుర్స్‌..! కుక్కపై ప్రశంసలు.. వైరల్‌ అవుతున్న క్యూట్‌ వీడియో.

David Warner As Dj Tillu: డీజే టిల్లు గెటప్‌లో అదరగొట్టిన డేవిడ్‌ వార్నర్‌.. అదరహో అనిపించేలా వార్నర్‌ న్యూలుక్‌..

Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..

Published on: Nov 23, 2022 09:19 AM