Viral Video: ప్రియురాలి పెళ్ళికి వచ్చిన ప్రియుడు.. స్టేజిపైనే ఎం చేసాడంటే.. వీడియో.

|

May 24, 2024 | 8:41 AM

ప్రేమించిన అమ్మాయి దూరమైతే ఎవరైనా తట్టుకోలేరు. ఆ అక్కసును రకరకాలుగా చూపిస్తుంటారు. తాజాగా తను ప్రేమించిన అమ్మాయి మరొక వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో తట్టుకోలేకపోయిన ఆ యువకుడు యువతి వివాహానికి వెళ్లి రిసెప్షన్‌లో వధూవరులకు విషెస్‌ చెబుతున్నట్టే చెప్పి వరుడ్నిచితకబాదాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు.

రాజస్థాన్ లోని భిల్వారాలో సినిమాను తలదన్నే రీతిలో ఈ దాడి జరిగింది. నవ దంపతులతో ఫొటో దిగేందుకు వేదికపైకి ఎక్కిన ఓ యువకుడు తన మాజీ ప్రేయసి అయిన వధువు పక్కన నిలబడి ఫొటోలకు పోజులిచ్చాడు. ఆ తర్వాత ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అనంతరం వరుడి వద్దకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చినట్లే ఇచ్చి ఒక్కసారిగా దాడి చేయడం మొదలుపెట్టాడు. అతనిపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. దీంతో అక్కడున్న వారంతా వెంటనే అతన్ని పట్టుకొని వెనక్కి లాగేశారు. ఈ తతంగాన్నంతా కాస్త దూరం నుంచి ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పెళ్లి కూతురు, ఆమె మాజీ లవర్ గతంలో ఒకే స్కూల్ లో పనిచేశారని అందులో పేర్కొన్నాడు. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఓ నెటిజన్ అతన్ని పిరికివాడిగా అభివర్ణించగా.. అమ్మాయి మనసు గెలుచుకోలేని వ్యక్తులు వారి ఆగ్రహాన్ని ఇలానే బయటపెడతారు అంటూ మరొకరు కామెంట్ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on