Haryanvi Singer: యంగ్ సింగర్ ను దారుణంగా.. నగ్నంగా పాతిపెట్టిన దుండగులు.! ఎం చేసారంటే..

|

May 29, 2022 | 9:57 AM

యువ గాయనిని కిడ్నాప్ చేసి.. 12 రోజుల తర్వాత హతమార్చిన ఘటన వెలుగుచూసింది. ఢిల్లీకి చెందిన హర్యాన్వీ సింగర్ దివ్య ఇండోరా అలియాస్‌ సంగీత.. దారుణ హత్యకు గురైంది. రోహ్‌తక్ సమీపంలోని ఓ ఫ్లైఓవర్‌ వద్ద పాతిపెట్టిన ఓ యువతి


యువ గాయనిని కిడ్నాప్ చేసి.. 12 రోజుల తర్వాత హతమార్చిన ఘటన వెలుగుచూసింది. ఢిల్లీకి చెందిన హర్యాన్వీ సింగర్ దివ్య ఇండోరా అలియాస్‌ సంగీత.. దారుణ హత్యకు గురైంది. రోహ్‌తక్ సమీపంలోని ఓ ఫ్లైఓవర్‌ వద్ద పాతిపెట్టిన ఓ యువతి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరీక్షల అనంతరం .. ఆ మృతదేహం దివ్యదే అని నిర్ధారించారు. ఆమె మృతదేహం అండర్‌వేర్‌పై మాత్రమే లభించడంతో.. అత్యాచారం జరిగి ఉంటుందని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో పోలీసుల పాత్రపైనా వాళ్లు ఆరోపణలు చేశారు. హర్యాన్వీ సింగర్ సంగీత అలియాస్ దివ్య ఇండోరా మే 11 నుంచి కనిపించకుండా పోయింది. మూడు రోజుల తర్వాత ఆమె తల్లిదండ్రులు.. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమెతో పాటు పని చేసే రవి, రోహిత్‌లు.. మ్యూజిక్‌ ఆల్బమ్‌ చేసే వంకతో ఆమెను ఎత్తుకెళ్లి ఉంటారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దర్యాప్తు సందర్భంగా.. రోహ్‌తక్‌ మెహమ్‌ సమీపంలోని ఓ హోటల్‌లో ఆ ముగ్గురు కలిసి భోజనం చేసిన ఫుటేజీలు వెలుగులోకి వచ్చాయి. బర్సాతి డ్రెయిన్ దగ్గర్లోని ఫ్లై ఓవర్‌ సమీపంలో.. తవ్వకాలు చేస్తుండగా నగ్నంగా పాతిపెట్టి ఉన్న ఓ యువతి మృతదేహాన్ని చూశామంటూ స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. పరీక్షల నిర్ధారణ అనంతరం బాధితురాల్ని హర్యాన్వీ సింగర్‌ దివ్య ఇండోరాగా గుర్తించారు పోలీసులు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?

Child cooking: ఈ బుడ్డోడు గరిటపడితే బాల భీముడే.. బుడతడి వంటకు నెటిజన్లు ఫిదా..!

Published on: May 29, 2022 09:56 AM