మృత్యువును జయించి తిరిగి తన ప్రపంచంలోకి వెళ్లిన చిన్నారి !!

Updated on: Nov 10, 2022 | 9:13 AM

స్కూల్లో ఆడుతూ పాడుతూ పాఠాలు నేర్చుకోవలసిన వయసులో ఓ భయంకర వ్యాధి ఆ చిన్నారి జీవితాన్నే మార్చేసింది. పుస్తకాలు పట్టుకొని బడికి వెళ్లాల్సిన ఆ బాలుడు ఆస్పత్రుల చుట్టూ తిరిగుతూ తన బాల్యాన్ని భారంగా గడుపుతున్నాడు.

స్కూల్లో ఆడుతూ పాడుతూ పాఠాలు నేర్చుకోవలసిన వయసులో ఓ భయంకర వ్యాధి ఆ చిన్నారి జీవితాన్నే మార్చేసింది. పుస్తకాలు పట్టుకొని బడికి వెళ్లాల్సిన ఆ బాలుడు ఆస్పత్రుల చుట్టూ తిరిగుతూ తన బాల్యాన్ని భారంగా గడుపుతున్నాడు. బెర్నార్డో అనే బాలుడు 2021 ఆగస్టులో లుకేమియా అనే క్యాన్సర్‌ బారినపడ్డాడు. ఏడాదిపాటు కీమోథెరపీ తీసుకున్నాడు. ఇటీవలే క్యాన్సర్‌నుంచి కోలుకున్నాడు. దాంతో తన మిత్రులు, టీచర్లు అందరినీ తలచుకుంటూ తనదైన ప్రపంచంలోకి అడుగు పెట్టాడు. తన తల్లిదండ్రులతో కలిసి స్కూలుకు వెళ్లాడు. అత‌ను స్కూల్ గేటు దాట‌గానే అత‌డికి ఊహించ‌ని విధంగా స్వాగ‌తం ల‌భించింది. తోటి విద్యార్థులు దారికి ఇరువైపులా నిల్చొని చ‌ప్పట్లు కొడుతూ స్వాగ‌తం ప‌లికారు. అంతేకాదు టీచ‌ర్లు అత‌డిని ప్రేమ‌గా కౌగిలించుకున్నారు. ఊహించని ఈ సంఘటనతో బెర్నార్డోతో పాటు అత‌ని త‌ల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోయారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వైర‌ల్ అవుతున్న ఈ వీడియో అంద‌ర్నీ క‌దిలిస్తోంది. బెర్నార్డో వీడియో చూసినవాళ్లు ‘బెర్నార్డో నువ్వొక ఫైట‌ర్. అందుకే నువ్వు క్యాన్సర్ మీద‌ విజ‌యం సాధించావు’ అని కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వామ్మో.. ప్రపంచంలో ఒకే పేరుతో ఇంతమంది ఉన్నారా !! సరికొత్త గిన్నిస్‌ రికార్డ్‌ !!

మహిళలపై లాఠీ ఝళిపించిన మగ పోలీసులు.. వీడియో వైరల్ !!

Guinness World Records: వారెవా.. చప్పట్లతో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌..

బయటపడిన అత్యంత అరుదైన మరకతం !! ఏకంగా కిలోన్నర !!

సూర్యుడికంటే 10 రెట్లు పెద్దదైన బ్లాక్‌ హోల్‌.. భూమికి అతి దగ్గరగా..

 

Published on: Nov 10, 2022 09:12 AM
Loading...
Unable to load recommendations.
Follow Us