ఊరికే పనిచేస్తా.. ఉద్యోగం ఇవ్వండి ప్లీజ్‌.. ఓ టెక్కీ ఆవేదన

Updated on: Feb 23, 2025 | 9:16 PM

చదువుపూర్తయి రెండేళ్లయినా ఉద్యోగం దొరక్క ఓ టెక్ గ్రాడ్యుయేట్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అనుభవం లేదంటూ ఎదుర్కొన్న తిరస్కరణలతో కొత్త ఆలోచన చేశారు. దానినే ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఇప్పుడు ఆ పోస్టు నెట్టింట్లో వైరల్‌గా మారింది. నిరుద్యోగంతో నిరాశ చెందిన ఓ బెంగళూరు గ్రాడ్యుయేట్ తన రెజ్యుమ్‌ను సోషల్ మీడియా వేదికగా షేర్‌ చేశారు. 2023లో ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో బీఈ పూర్తి చేసానని, ప్రస్తుతం ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నానని తెలిపారు.

ఈ ఉద్యోగ అన్వేషణలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నానని, అనుభవం లేదంటూ ఎవరూ ఉద్యోగం ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తన రెజ్యూమ్‌ను పక్కనపడేసినా పర్లేదు.. ఉచితంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను..దయచేసి ఉద్యోగం ఇచ్చి సహాయం చేయండి అంటూ అభ్యర్ధించారు. జావా, పైథాన్‌, క్లౌడ్ కంప్యూటింగ్‌, మెషిన్ లెర్నింగ్‌ తదితర కోర్సుల్లో తనకు ప్రావీణ్యం ఉందన్నారు. ఇలా పనిచేయడం వల్ల కనీసం అనుభవమైనా వస్తుందని ఆ టెకీ భావిస్తున్నారు. ఈ పోస్టుపై పలువురు స్పందించారు. కొందరు సలహాలు, సూచనలు చేశారు. సీవీని మరింత మెరుగ్గా సిద్ధం చేసుకోమని సూచించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బర్త్‌డే పార్టీలో కేకుపై క్యాండిల్‌ వెలిగించిన యువతి.. క్షణాల్లో

రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే రూ.10 లక్షలు.. పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్‌

వీళ్ల కరెంట్ బిల్‌తో.. విల్లా కొనేయొచ్చు !! షాకిస్తున్న హీరోల కరెంట్‌ బిల్

మరో గుడ్ న్యూస్ చెప్పనున్న అక్కినేని ఫ్యామిలీ..

Monalisa: మోనాలిసా గొప్ప మనసుకు జనం ఫిదా..