Mahalakshmi Murder: యూట్యూబ్‌ చూస్తూ శరీరాన్ని ముక్కలు చేసి.! హంతకుడి వికృత చేష్ట..

|

Oct 11, 2024 | 8:24 PM

బెంగళూరులో బ్యూటీషియన్‌ మహాలక్ష్మి ని సెప్టెంబరు 2న హత్య చేసిన ముక్తిరంజన్‌ దాస్‌.. ఆ మృతదేహాన్ని తరలించడం కష్టమని భావించి, దాన్ని ముక్కలు చేశాడని పోలీసులు గుర్తించారు. మహాలక్ష్మిని ప్రేమిస్తున్న అతను ఒకరోజు అనుమానంతో ఆమె ఫోన్‌ను పరిశీలించగా, ఆమెకు వివాహమై, ఒక కొడుకు ఉన్నాడని, వారిద్దరినీ వదిలి ఒంటరిగా ఉంటోందని తెలుసుకుని గొడవ పడ్డాడు.

బెంగళూరులో బ్యూటీషియన్‌ మహాలక్ష్మి ని సెప్టెంబరు 2న హత్య చేసిన ముక్తిరంజన్‌ దాస్‌.. ఆ మృతదేహాన్ని తరలించడం కష్టమని భావించి, దాన్ని ముక్కలు చేశాడని పోలీసులు గుర్తించారు. మహాలక్ష్మిని ప్రేమిస్తున్న అతను ఒకరోజు అనుమానంతో ఆమె ఫోన్‌ను పరిశీలించగా, ఆమెకు వివాహమై, ఒక కొడుకు ఉన్నాడని, వారిద్దరినీ వదిలి ఒంటరిగా ఉంటోందని తెలుసుకుని గొడవ పడ్డాడు. ఆమెకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ, మరో యువతితో అతను స్నేహాన్ని పెంచుకున్నాడు. ఆ యువతితోనూ మహాలక్ష్మి గొడవ పడింది. ఇక తన భర్తకు విడాకులు ఇచ్చేస్తానని, వివాహం చేసుకుందాం అని దాస్ తో చెప్పింది. తనకు దూరంగా ఉంటే, అత్యాచారం చేశావని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. దీంతో దాస్.. కోపంతో ఆమెపై దాడి చేశాడు. కిందపడి స్పృహకోల్పోయిన ఆమె మొహంపై దిండుతో అదిమి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడని పోలీసులు తెలిపారు.

హత్య అనంతరం యూట్యూబ్‌లో వీడియోలు చూసి మృతదేహాన్ని ఎలా ముక్కలు చేయాలో తెలుసుకున్నాడని పోలీసులు చెప్పారు. రిఫ్రిజిరేటర్‌లో శరీర భాగాలను కూరగాయల తరహాలో నిందితుడు పేర్చి, రక్తం మరకలు కనిపించకుండా యాసిడ్‌తో శుభ్రం చేశాడు. హత్య చేసిన తరువాత రోజు ఉదయమే హెబ్బగోడిలోని తన గదికి వెళ్లాడు. అక్కడ ఉన్న సోదరుడికి జరిగిన విషయం చెప్పి, గది ఖాళీ చేసి తన బైకుపైనే 1600 కి.మీ. ప్రయాణించి సొంతూరికి చేరుకున్నాడు. జరిగిన విషయాన్ని తల్లికి చెప్పాడు. మహాలక్ష్మి హత్యకు సంబంధించిన వివరాలు బయటకు వస్తాయని చాలా రోజులు వేచి చూశాడు. సెప్టెంబరు మూడో వారంలో హత్య జరిగిన విషయం వెలుగులోకి వచ్చిన అనంతరం అతను భయపడ్డాడు. తన కోసం ఆంధ్ర, బెంగాల్, పోలీసులు గాలిస్తున్నారని తెలుసుకుని, తన ఊళ్లోనే డెత్‌నోట్ రాసి ఉరి వేసుకున్నాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.