క్యాన్సర్ బారిన పడిన తల్లికోసం ఆ బాలుడు చేసిన పనికి.. కంటతడి ప్రేమ

|

May 23, 2023 | 9:52 AM

క్యాన్సర్ బారిన పడిన తన తల్లిని సంతోషపెట్టడానికి ఓ బాలుడు చేసిన పని కంటతడి పెట్టిస్తుంది. ఈ వీడియోలో తల్లి, కొడుకుల మధ్య జరిగిన ఈ క్షణాలు మాటల్లో వర్ణించలేనివి. ఓ యూజర్‌ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో క్యాన్సర్‌తో బాధపడుతున్న తల్లి, కొడుకుకు మధ్య జరిగిన ఒక భావోద్వేగ సంఘటన వీడియోను

క్యాన్సర్ బారిన పడిన తన తల్లిని సంతోషపెట్టడానికి ఓ బాలుడు చేసిన పని కంటతడి పెట్టిస్తుంది. ఈ వీడియోలో తల్లి, కొడుకుల మధ్య జరిగిన ఈ క్షణాలు మాటల్లో వర్ణించలేనివి. ఓ యూజర్‌ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో క్యాన్సర్‌తో బాధపడుతున్న తల్లి, కొడుకుకు మధ్య జరిగిన ఒక భావోద్వేగ సంఘటన వీడియోను పోస్ట్ చేశారు. అది నెటిజన్లను కదిలిస్తోంది.. కంటతడి పెట్టిస్తోంది. బ్రెజిల్‌కు చెందిన ఓ బాలుడు ఓ సెలూన్‌లో హెయిర్ డ్రెస్సర్‌గా పనిచేస్తున్నాడు. క్యాన్సర్‌తో బాధపడుతున్న తన తల్లి కీమోథెరపీ చికిత్సకు వెళ్లేందుకు జుట్టు తీసేయాల్సి వచ్చింది. అందుకు ఆమె తన కుమారుడు పనిచేసే సెలూన్‌కే వచ్చింది. తల్లికి జుట్టు ట్రిమ్మర్‌తో తొలగించడం ప్రారంభించాడు ఆ బాలుడు. ఆ సమంలో తల్లి కళ్లలో నీళ్లు ఆగలేదు. అది చూసి ఆ కుర్రాడికి కూడా దుఃఖం తన్నుకుంటూ వచ్చింది. కానీ, అది తన మొహంలో కనపడనివ్వలేదు. అంతేకాదు, తల్లికి ట్రిమ్ చేయటం ఆపేసి తను కూడా జుట్టు తీసేసుకున్నాడు. అమ్మ చూస్తుండగానే, తన తలపై వెంట్రులకు మొత్తం తొలగించేసుకున్నాడు. ఆ కొడుకును చూసిన తల్లిమరింత భావోద్వేగానికి గురై పెద్దగా ఏడ్చేసింది. అంతే కాదు, సెలూన్‌లోని అతని స్నేహితులు కూడా ఈ భావోద్వేగ సమయంలో అతనికి మద్దతు ఇచ్చారు. వారు కూడా అమ్మకు అండగా తమ జుట్టు కత్తిరించుకున్నారు.. హృదయాన్ని కదిలించే ఈ వీడియోను చూసి చాలా మంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే నేడు చాలా మంది ఈ ప్రాణాంతక వ్యాధిని ఎదుర్కొంటున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కట్నం అడిగిన అల్లుడిని పెళ్లి పీటలపైనే చెప్పుతో కొట్టిన మామ !!

యువతులతో నగ్నంగా పూజలు !! తీరా చూస్తే అసలు కధే వేరు !!