ఫేస్ చూసి అమాయకుడనుకునేరు.. అసలు విషయం తెలిస్తే..

Updated on: Feb 27, 2026 | 8:50 PM

ఏటీఎంల వద్ద వృద్ధులను, నిరక్షరాస్యులను మోసం చేస్తూ అంతర్-రాష్ట్ర ఏటీఎం మోసాలకు పాల్పడుతున్న మువ్వ వీరయ్య చౌదరిని అనకాపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 20కి పైగా నేరాలు చేసి, ఏటీఎం కార్డులు మార్చి డబ్బులు కాజేసిన ఇతడిని పట్టుకున్నారు. పిన్ నంబర్లు, కార్డులను ఇతరులతో పంచుకోవద్దని పోలీసులు ప్రజలను హెచ్చరించారు.

నల్లనివన్నీ నీళ్లు.. తెల్లనివన్నీ పాలు కానట్టు చూడటానికి అమాయకంగా కనిపించే వాళ్లంతా అమాయకులనుకుంటే పొరపాటే. పైకి అమాయక చక్రవర్తిలా కనిపిస్తూ తన తెలివితేటలతో రెండు రాష్ట్రాలపోలీసులకు సవాలుగా మారాడు ఓ కేటుగాడు. ఏటీఎం సెంటర్ల వద్ద కాపుకాసి వృద్ధులను, నిరక్షరాస్యులను బురిడీ కొట్టించడంలో ఆరితేరిన ‘ఇంటర్ స్టేట్’ క్రిమినల్ మువ్వ వీరయ్య చౌదరి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 20కి పైగా నేరాలకు పాల్పడిన ఈ కిలాడీ దొంగను అనకాపల్లి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నర్సీపట్నంకు చెందిన నూకరాజు అనే వ్యక్తి ఈ నెల 17న నగదు డ్రా చేసేందుకు యూనియన్ బ్యాంక్ ఏటీఎంకు వెళ్ళాడు. సాంకేతిక పరిజ్ఞానం లేని నూకరాజు, అక్కడ ఉన్న వీరయ్య చౌదరి సహాయం కోరాడు. ఇదే అదనుగా భావించిన నిందితుడు, పిన్ నంబర్ అడిగి తెలుసుకుని, సర్వర్ రావడం లేదని నమ్మించి అసలు కార్డును తన వద్ద ఉంచుకుని నూకరాజుకు నకిలీ కార్డు ఇచ్చాడు. బాధితుడు వెళ్లిన నిమిషాల వ్యవధిలోనే అతని ఖాతా నుండి రూ. 15 వేలు కాజేశాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన నర్సీపట్నం సీఐ గఫూర్ బృందం, సిసి టీవీ ఫుటేజీల ఆధారంగా విచారణ చేపట్టింది. నిందితుడు విశాఖలోని మర్రిపాలెంలో మకాం వేసినట్లు గుర్తించి మెరుపు దాడి చేసి పట్టుకున్నారు. విచారణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. వీరయ్య చౌదరిపై మిర్యాలగూడ, పాలకొండ, ఆముదాలవలస, జనగాం, కాజీపేట వంటి ప్రాంతాల్లో 2017 నుండి అనేక కేసులు ఉన్నట్లు డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. నిందితుడి వద్ద నుండి 9 ఏటీఎం కార్డులు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఏటీఎం సెంటర్ల వద్ద గుర్తు తెలియని వ్యక్తులకు కార్డులు ఇవ్వవద్దని, పిన్ నంబర్లు చెప్పి మోసపోవద్దని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ram Charan: మాలతో చరణ్‌ పార్టీకి వెళ్లడంపై వివాదం !! శిరీష్‌ క్లారిటీ

Vijay-Rashmika Marriage: ఇద్దరి ఆలోచనా ధోరణి ఒక్కటే.. అందుకే కలిశారేమో..

Vijay-Rashmika Marriage: కట్టా- మీటా లాంటి లవ్‌ స్టోరీ.. ఎన్ని స్టేజ్‌లు దాటారంటే ??

Vijay-Rashmika Marriage: 9 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పడిన వేళ.. విరోషి పెళ్లి ఆనందభరితం

Bigg Boss Emmanuel: బిగ్ బాస్‌ ఓటమిని తలుచుకొని.. కన్నీళ్లు పెట్టుకున్న ఇమ్మూ

Loading...
Unable to load recommendations.
Follow Us