యువకుడిగా ఉండగా పరీక్ష.. వృద్ధుడయ్యాక వచ్చిన కొలువు!

Updated on: Jun 02, 2026 | 7:44 PM

ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూసిన ఓ వ్యక్తికి 18 ఏళ్ల తర్వాత నియామక ఉత్తర్వులు అందాయి. కానీ అప్పటికే ఆయన ఉద్యోగ విరమణ వయసు దాటిపోయారు. కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన అబ్దుల్ మజీద్‌కు పీఎస్‌సీ నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి ఎదురైంది. జీవితకాల కల నెరవేరినా ఉద్యోగంలో చేరే అవకాశం లేకపోవడంతో ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది ఆ యువకుడి దశాబ్దాల కల. దానికోసం ఎంతో కష్టపడి పరీక్ష రాశాడు, ర్యాంక్ లిస్టులోనూ నిలిచాడు. కానీ, ఆ ఉద్యోగ నియామక పత్రం ఆయన చేతికి రావడానికి మాత్రం.. ఏకంగా 18 ఏళ్లు పట్టింది. తీరా ఆ లేఖ చేతికి అందేసరికి ఆయన ఉద్యోగ విరమణ వయసు కూడా దాటిపోవడం గమనార్హం. కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్లక్ష్యానికి అద్దం పట్టే ఈ విచిత్ర ఘటన మలప్పురం జిల్లాలో వెలుగుచూసింది. మలప్పురం జిల్లా కాళికావుకు చెందిన అబ్దుల్ మజీద్ 2005లో పార్ట్ టైమ్ జూనియర్ అరబిక్ టీచర్ పోస్టుకు పీఎస్‌సీ నిర్వహించిన పరీక్ష రాశారు. ఆ తర్వాత విడుదలైన ర్యాంక్ జాబితాలో ఆయన పేరు ఉన్నప్పటికీ, 2008తో ఆ లిస్ట్ గడువు ముగియడంతో ఆయన ఆశలు వదులుకున్నారు. అయితే, సదరు పోస్టుకు అర్హులైన అభ్యర్థులు దొరకలేదనే సాకుతో అధికారులు ఇటీవల పాత ఫైళ్లను దులిపారు. అందులో మజీద్‌ను ఎంపిక చేస్తూ గత నెలలో అనూహ్యంగా నియామక ఉత్తర్వులను పంపారు. నిబంధనల ప్రకారం లేఖ అందిన మూడు నెలల్లోగా ఉద్యోగంలో చేరాలి. కానీ, మజీద్ సర్టిఫికెట్ల ప్రకారం ఆయన పుట్టిన తేదీ 1966 మే 27. అంటే, ఈ ఉత్తర్వు చేతికి వచ్చే సమయానికే ఆయన 60 ఏళ్లకు చేరువయ్యారు. ఇప్పటికే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉద్యోగ విరమణ వయసు దాటిపోవడంతో, సాంకేతికంగా ఆయన ఆ ఉద్యోగంలో చేరే అర్హతను కోల్పోయారు. “నా జీవిత కాల కలను నెరవేర్చడానికి పీఎస్‌సీకి 18 ఏళ్లు పట్టింది. ఇప్పుడు ఈ అపాయింట్‌మెంట్ లెటర్‌ను నేనేం చేసుకోను?’ అంటూ మజీద్ కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషయంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్లక్ష్యాన్ని గుర్తించి.. తనకు కనీసం ఏడాదైనా ఉద్యోగం చేసుకునేలా.. అవకాశం కల్పించాల్సిందిగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి వినతిపత్రం పంపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తండ్రి ప్రేమ.. కొడుకు హోంవర్క్‌ చేద్దామని ప్రయత్నిస్తే..

రబ్బరు పడవలో 30 గంటల జర్నీ.. కుటుంబాన్ని కలవడం కోసం సాహసం

చెన్నకేశవ స్వామి పాదాల నుంచి ఎర్రని ద్రవం! కలియుగాంతానికి సంకేతమంటూ భక్తుల్లో భయం

భూమి అమ్మి భార్యను చదివించాడు.. టీచర్ ఉద్యోగం రాగానే..

యువ‌త‌లో పెరుగుతున్న పెద్ద పేగు క్యాన్స‌ర్‌.. అప్ర‌మ‌త్తంగా ఉండ‌క‌పోతే ముప్పే

Follow Us