Viral Video: పెళ్ళిపీటల మీద ఊడిపోయిన వరుడి విగ్గు.. పెళ్లి రద్దు చేసుకున్న పిల్ల

|

May 27, 2022 | 9:11 AM

వెయ్యి అవద్దాలు ఆడైన ఓ పెండ్లి జెయ్యాలంటరు. వెయ్యి అబద్దాలు కాదు, పాపం ఓ పెండ్లి కొడ్కు ఒక్కటే ఒక్క అవద్దం ఆడిండు. దాన్కే పెండ్లి పీఠల మీదనే పెండ్లి ఆపి, తెగదెంపులు జేస్కొని పోయిర్రుల్ల.

వెయ్యి అవద్దాలు ఆడైన ఓ పెండ్లి జెయ్యాలంటరు. వెయ్యి అబద్దాలు కాదు, పాపం ఓ పెండ్లి కొడ్కు ఒక్కటే ఒక్క అవద్దం ఆడిండు. దాన్కే పెండ్లి పీఠల మీదనే పెండ్లి ఆపి, తెగదెంపులు జేస్కొని పోయిర్రుల్ల. గింత అన్నాలముంటదానుల్ల. మరి ఆ పెండ్లికొడ్కు ఆడిన అవద్దం ఏందన్కున్నరు. గాచారం మంచిగ లేనప్పుడు అర్టిపండు తిన్న పన్నిర్గుతది అంటే గిదే మరీ..గీడో బట్టతలతొటున్న మన్షిని సూశిండ్రా.. ఈయ్న గురించే చెప్పుకునేది.. ఎన్కపోంటి ఎంత ఆస్తులుంటే ఏం లాభం నెత్తిమీద నాల్గు బాల్ పోసలు లేకుంటే అని పిల్లను సూడవోయిన కాడల్ల పిలగానికి బట్టతలున్నది పిల్ల మెచ్చనంటున్నదనే చెప్పి ఎల్లగొట్టిండ్రట. ఇంకొందరైతే నెత్తిమీద ఇంత మైదానం పెట్టుకోని కన్యాదానం చేయ్యిమని అచ్చినవా అని దెప్పి పొడ్శిండ్రట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తండ్రి తెచ్చిన సెకండ్ హ్యాండ్ సైకిల్ చూసి.. సంతోషం తో కొడుకు రియాక్షన్‌ కి ఫిదా అయిపోయిన నెటిజన్స్

Published on: May 27, 2022 09:11 AM