ప్రియుడితో కలిసి భర్త మర్డర్.. ఇక తెల్లార్లు అదే పని
గుంటూరులో షాకింగ్ ఘటన. వివాహేతర సంబంధం కోసం భార్య తన ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది. నిద్రమాత్రలు కలిపిన బిర్యానీ తిని భర్త నిద్రలోకి జారుకోగా, ఊపిరాడకుండా చేసి చంపారు. హత్య తర్వాత రాత్రంతా శవం పక్కన పోర్న్ వీడియోలు చూసింది. మృతదేహంపై అనుమానాలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి భార్యను అరెస్ట్ చేశారు. ఈ ఘటన సమాజంలో మానవత్వం నశిస్తున్న తీరును చూపిస్తోంది.
రాను రాను మనుషుల్లో మానవత్వం నశించిపోతోందా?.. బంధాలు, అనుబంధాలకు విలువే లేకుండా పోతోందా? అంటే అవుననే అనిపిస్తోంది. ముఖ్యంగా వివాహ బంధం ఉనికిని కోల్పోతుందా అనిపించే అనేక దారుణ ఘటనలు ఇటీవలి కాలంలో జరుగుతున్నాయి. వివాహేతర సంబంధాల మోజులో కట్టుకున్న భర్త, భార్య, పిల్లలు అని కూడా చూడకుండా కొందరు దారుణంగా ప్రాణాలు తీసేస్తున్నారు. నాగరికత పెరుగుతున్నకొద్దీ మానవులు అనాగరికంగా మారుతున్నారు. తాజాగా ఓ మహిళ ప్రవర్తించిన తీరు ఊహించటానికి భయంగా కలిగిస్తోంది. వివాహేతర సంబంధం కోసం భర్తను చంపడమే కాకుండా రాత్రంతా అతని శవం దగ్గర కూర్చుని పోర్న్ వీడియోలు చూస్తూ గడిపిన ఆమె కిరాతకం చూస్తే ఆందోళన కలుగుతోంది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన లోకం శివనాగరాజు ఉల్లిపాయల వ్యాపారం చేస్తుండేవాడు. ఆయనకు 2007లో లక్ష్మీమాధురితో వివాహం కాగా, ఇద్దరు కుమారులు ఉన్నారు. విజయవాడలోని ఓ సినిమా హాల్లో టికెట్ కౌంటర్‌లో పనిచేస్తున్న మాధురికి, సత్తెనపల్లికి చెందిన గోపి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కొంతకాలానికి వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్త చేసే ఉల్లిపాయల వ్యాపారంపై చులకన భావంతో ఉన్న మాధురి, ఆ వ్యాపారాన్ని మాన్పించింది. అనంతరం వ్యాపారం పేరుతో భర్తను హైదరాబాద్ పంపించింది. కొన్నాళ్ల తర్వాత శివనాగరాజు తిరిగి గ్రామానికి రావడంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. భర్త తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన మాధురి, అతడిని అంతమొందించాలని ప్రియుడు గోపితో కలిసి పక్కా ప్రణాళిక వేసింది. జనవరి 18న రాత్రి భర్త కోసం వండిన బిర్యానీలో నిద్రమాత్రలను కలిపి ఎంతో ప్రేమగా వడ్డించింది. అది తిన్న శివనాగరాజు గాఢ నిద్రలోకి జారుకున్నాక, తన ప్లాన్ అమలు చేసింది. రాత్రి 11:30 గంటల సమయంలో ప్రియుడు గోపి అక్కడికి చేరుకున్నాడు. శివనాగరాజు ఛాతీపై గోపి కూర్చోగా, మాధురి దిండుతో ముఖంపై గట్టిగా అదిమి ఊపిరాడకుండా చేసింది. భర్త చనిపోయాడని నిర్ధారించుకున్నాక గోపి వెళ్లిపోయాడు. మాధురి ఏమాత్రం కంగారు లేకుండా రాత్రంతా పోర్న్ వీడియోలు చూస్తూ గడిపింది. తెల్లవారుజామున 4 గంటలకు చుట్టుపక్కల వారిని పిలిచి, తన భర్త గుండెనొప్పితో మరణించాడని నాటకం మొదలుపెట్టింది. అయితే, అంత్యక్రియల ఏర్పాట్లు చేస్తుండగా వచ్చిన శివనాగరాజు స్నేహితులు, మృతదేహం చెవి నుంచి రక్తం కారడం, గాయం ఉండటాన్ని గమనించి అనుమానంతో మృతుడి తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఊపిరాడకపోవడం వల్లే మరణించాడని, పక్కటెముకలు విరిగాయని రిపోర్టులో తేలడంతో పోలీసుల అనుమానం బలపడింది. అనంతరం మాధురిని అదుపులోకి తీసుకుని విచారించగా, ఆమె నేరాన్ని అంగీకరించింది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు ఒప్పుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మేడారం జాతర ఏరియల్ వ్యూ కోసం హెలికాప్టర్ రైడ్స్.. డిస్కౌంట్ కూడా..
ప్రపంచ అతిపెద్ద గనులు మూసివేత ?? కారణం..
Driving License: ఈ ఐదు తప్పులు చేస్తే లైసెన్స్ కట్ !!