అగ్నిప్రమాదల నివారణకు రోబోలు.. వీడియో

Updated on: Apr 28, 2025 | 10:28 PM

అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ప్రమాదంలో చిక్కుకున్న వారి ప్రాణాలు ఎంత ముఖ్యమో రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న సిబ్బంది భద్రత కూడా అంతే ముఖ్యం. ప్రమాదం జరిగిన స్పాట్ కి వెళ్ళాలంటే ప్రాణాలతో చొలగాటమే. అందుకే అగ్నిమాపక శాఖ కోట్లన్నర ఖర్చు పెట్టి ఆధునికమైన ఫైర్ రోబోను కొనుగోలు చేసింది. రిమోట్ తో ఆపరేట్ చేసే ఈ రోబో 60 మీటర్ల వరకు నీటిని చల్లుతుంది. దీంతోపాటు దీనికి ఏర్పాటు చేసిన థర్మల్ కెమెరా అగ్ని మొదట ఎక్కడ ప్రారంభమైందో ఈజీగా కనిపెట్టగలగటం దీని ప్రత్యేకత.

900 డిగ్రీల సెల్సియస్ వరకు ఈ రోబో వేడిని తట్టుకోగలదు. అగ్ని ప్రమాదం జరిగిన స్పాట్ కి దగ్గరగా ఈ రోబో పనిచేస్తుంది. కాబట్టి సెల్ఫ్ కూలింగ్ టెక్నాలజీ ఇందులో ఏర్పాటు చేశారు. థర్మల్ కెమెరాతో పాటు ఈ రోబోకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ కూడా ఉంటాయి. ఒక్కసారి బ్యాటరీని రీఛార్జ్ చేస్తే ఆరు గంటల వరకు కంటిన్యూస్ గా రోబో పనిచేస్తుంది. రోబో పనిచేస్తుండగానే రెస్క్యూ ఆపరేషన్ కి విఘాతం కలగకుండా దీని బ్యాటరీ మార్చగలగటం దీని మరో ప్రత్యేకత. రిమోట్ తో 500 మీటర్ల వరకు దీన్ని ఆపరేట్ చేయొచ్చు. 360 డిగ్రీస్ యాంగిల్ లో వాటర్ ని స్ప్రే చేయగలదు ఈ రోబో. ప్రస్తుతం మూడు రోబోలు కొనుగోలు చేసింది ప్రభుత్వం. భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి రోబోలతో అగ్ని ప్రమాదాలను సులువుగా నివారించవచ్చని అధికారులు అంటున్నారు. అసలు ఈ రోబో ఎలా పనిచేస్తుందో మా ప్రతినిధి శ్రీకాంత్ వివరిస్తారు.