అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత

Updated on: Mar 01, 2026 | 8:20 PM

అనకాపల్లి సూక్ష్మ కళాకారుడు గట్టెం వెంకటేష్ పెన్సిల్ మొనపై అద్భుతమైన తాజ్ మహల్‌ను చెక్కి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. కేవలం 4mm ఎత్తు, వెడల్పుతో రూపొందించిన ఈ కళాఖండం అతని అసాధారణ ప్రతిభకు నిదర్శనం. గతంలో గిన్నిస్ బుక్‌లోనూ చోటు సంపాదించిన వెంకటేష్, తెలుగు రాష్ట్రాల కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడు. అతని పట్టుదల, ఏకాగ్రత అభినందనీయం.

కళకు హద్దులు లేవని, ఆసక్తి, పట్టుదల, ఏకాగ్రత ఉంటే అసాధారణమైన అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించాడు అనకాపల్లి జిల్లాకు చెందిన సూక్ష్మ కళాకారుడు గట్టెం వెంకటేష్. పెన్సిల్ మొనపై అత్యంత సూక్ష్మమైన ‘తాజ్ మహల్’ను చెక్కి, ప్రతిష్టాత్మకమైన లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నాడు. నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లు గ్రామానికి చెందిన వెంకటేష్, కేవలం 4 మిల్లీమీటర్ల ఎత్తు, 4 మిల్లీమీటర్ల వెడల్పుతో ఈ అపురూప తాజ్ మహల్‌ను రూపొందించాడు. కంటికి కూడా సరిగ్గా కనిపించని అంత చిన్న పరిమాణంలో, ప్రపంచ వింతైన తాజ్ మహల్ ఆకృతిని అత్యంత స్పష్టంగా పెన్సిల్ గ్రాఫైట్ పై చెక్కడం అందరినీ అశ్చర్యానికి గురిచేసింది. 2025 ఏప్రిల్‌లో ఈ సూక్ష్మ కళాఖండాన్ని సృష్టించిన వెంకటేష్, తన ప్రతిభను లిమ్కా బుక్ ప్రతినిధులకు పంపగా, వారు పరిశీలించి అతని.. ప్రతిభను గుర్తిస్తూ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ చోటు కల్పించారు. దీంతో మరో అరుదైన గుర్తింపు దక్కించుకున్నాడు సూక్ష్మ కళాకారుడు వెంకటేష్. ఇదివరకే పెన్సిల్ మొనపై పలు దేవతా మూర్తుల విగ్రహాలను చెక్కి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సహా ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకున్నాడు. తాజా గుర్తింపుతో తెలుగు రాష్ట్రాల ఖ్యాతిని మరోసారి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన వెంకటేష్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము.. అంతలోనే..

Srisailam: మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే

TTD: శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Trisha Krishnan: ‘ఏదేమైనా నేను ఎప్పుడూ నీతోనే ఉంటా’త్రిష షాకింగ్ ట్వీట్!

Sree Vishnu: నా సినిమాను రిలీజ్‌కు ముందే లీక్ చేశారు’.. హీరో శ్రీవిష్ణు ఆవేదన

Follow Us