Elephant: ఏనుగును కర్రతో కొట్టాడు.. అది చూస్తూ ఊరుకుంటుందా..? దెబ్బకు పరుగందుకున్న యువకుడు..

Updated on: Dec 13, 2022 | 9:00 AM

ఏనుగుకు కోపం వచ్చిందంటే దానిని ఎవరూ అదుపుచేయలేరు. దొరికిన వాళ్లను దొరికినట్లు తొండంతో విసిరి అవతల పడేస్తుంది. పెద్ద వీరంగమే సృష్టిస్తుంది. అందుకే అకారణంగా ఏనుగు జోలికి పోకూడదు.


ఏనుగుకు కోపం వచ్చిందంటే దానిని ఎవరూ అదుపుచేయలేరు. దొరికిన వాళ్లను దొరికినట్లు తొండంతో విసిరి అవతల పడేస్తుంది. పెద్ద వీరంగమే సృష్టిస్తుంది. అందుకే అకారణంగా ఏనుగు జోలికి పోకూడదు. ఒక వేళ వెళ్లారో.. పరిస్థితి ఇలాగే ఉంటుంది.వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ చోట కొన్ని ఏనుగులు గుంపుగా ఉన్నాయి. వాటి మానాన అవి మేత మేస్తూ ఉన్నాయి. ఇంతలో ఓ ఇద్దరు యువకులు అక్కడికి వచ్చారు. వారిలో ఓ యువకుడు ఆ ఏనుగుల గుంపులో ఓ ఏనుగును పొడవాటి కర్రతీసుకొని అకారణంగా కొట్టాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ గజరాజు నన్నే కొడతావా.. అంటూ ఒక్కసారిగా యువకులపైకి దూసుకొచ్చింది. అంతే దెబ్బకు ఆ కుర్రాళ్లు పరుగులంకించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇండియన్‌ ఫారెస్ట్‌ అధికారి సురేంద్ర మెహ్రా ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ‘ఇదోరకమైన పిచ్చి..’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. ఇది చూసిన నెటిజన్లు.. యువకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. అకారణంగా మూగజీవులను హింసిస్తే అలాగే ఉంటుంది.. తిక్క కుదిరింది అంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Snake Bathing: నువ్వు తోపువి బాసూ.. కింగ్‌ కోబ్రాకి స్నానమా..! మగ్‌పై పలుమార్లు కాటు వేసిన పాము.. వీడియో.

Romance Before Marriage: పెళ్లికిముందే శృంగారం చేస్తే ఇక అంతే..! కొత్త చట్టం తీసుకురానున్న ప్రభుత్వం.

Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్‌ ప్రకటన..

Published on: Dec 13, 2022 09:00 AM
Loading...
Unable to load recommendations.
Follow Us