Viral Video: ఛీ ఇంత నీచమా..! దత్తపుత్రుడి నిర్వాకం..కెమెరాలు కట్‌చేసి దారుణం..

|

May 14, 2022 | 9:14 PM

హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కొడుకు తల్లిని దారుణంగా చంపేశాడు. జంగయ్య, భూదేవి దంపతులు P&T కాలనీ లో కాలనీలో నివాసముంటున్నారు. వీరికి సంతానం లేకపోవడంతో సాయి తేజ అనే యువకుడిని దత్తత తీసుకున్నారు.


హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కొడుకు తల్లిని దారుణంగా చంపేశాడు. జంగయ్య, భూదేవి దంపతులు P&T కాలనీ లో కాలనీలో నివాసముంటున్నారు. వీరికి సంతానం లేకపోవడంతో సాయి తేజ అనే యువకుడిని దత్తత తీసుకున్నారు. మే 6 శుక్రవారం రాత్రి జంగయ్య కింద గ్రౌండ్ ఫ్లోర్ లో నిద్రపోయాడు. తల్లి భూదేవి, దత్తపుత్రుడు సాయి తేజ లు మొదటి అంతస్తులో పడుకున్నారు. అంతా బాగానే వుంది.అయితే జంగయ్య ఉదయం పైకి వచ్చే వరకు భూదేవి అపస్మారక స్థితిలో పడిఉంది. ఆమెను నిద్రలేపేందుకు ప్రయత్నించగా, అప్పటికే ఆమె చనిపోయింది. అటు, సాయి తేజ కనిపించకుండా పోయాడు. ఇంట్లో ఉన్న 30 గ్రాముల బంగారు ఆభరణాలు, 10లక్షల నగదు తీసుకొని సాయితేజ పరారయ్యాడు. జంగయ్య వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆమె ముక్కూ నోరు మూసి, ఊపిరి ఆడకుండా చేయడంవల్ల మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. సాయి తేజ కోసం సరూర్ నగర్ పోలీసులు గాలింపుచేపట్టారు. ఇంట్లో సీసీ కెమేరాలు కట్ అయి వున్నాయి. పెంపుడు తల్లిని హత మార్చిన కొడుకు సాయి తేజ తన ఆనవాళ్లు గుర్తుపట్టకుండా ఉండేందుకు ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల వైర్లను కట్ చేసి పారిపోయినట్టు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కన్న కొడుకు కాకపోయినా ఎంతో ప్రేమగా పెంచిన కొడుకు ఇంతటి దారుణానికి ఒడిగట్టడంతో జంగయ్య కన్నీరుమున్నీరవుతున్నారు. భూదేవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urfi Javed-Samantha: సమంత చూపిస్తే అందం.. నేను చూపిస్తే అసహ్యమా.. శృంగార తార షాకింగ్ కామెంట్స్..

Viral Video: భార్య శవంతో 21 ఏళ్లుగా సహాజీవనం.. చివరకు..! వీడియో చుస్తే హృదయం కదలాల్సిందే..!

Funny Video: అది లెక్క..! నిజంగా వేడు మగాడ్రా బుజ్జి.. అభినవ పరమానందయ్య శిష్యుడు..! చూస్తే పొట్టచెక్కలే..

Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..

Published on: May 14, 2022 09:14 PM