నాలుగురోడ్ల కూడలి..దూసుకెళ్తున్న వాహనాలు.. ఓ లారీ డ్రైవర్ ఏం చేశాడో చూస్తే తిట్టకుండా ఉండరు!
రాజస్థాన్‌లోని అల్వార్‌లో ఒక భారీ కంటైనర్ లారీ డ్రైవర్ ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకర విన్యాసాలు చేశాడు. కదులుతున్న వాహనానికి స్టీరింగ్ వదిలేసి, క్యాబిన్ టాప్‌పై డాన్స్ చేస్తూ, కిటికీ నుండి వేలాడుతూ ఇతరుల ప్రాణాలకు ముప్పు తెచ్చాడు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారగా, నెటిజన్లు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
సామాజిక మాధ్యమాల్లో ప్రాచుర్యం పొందాలనే తపనతో యువత చేసే ప్రమాదకర విన్యాసాలు రోజురోజుకూ హద్దులు దాటుతున్నాయి. లైకులు, వీక్షణల కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టడమే కాకుండా, తోటి ప్రయాణికులను కూడా తీవ్ర ప్రమాదంలో పడేస్తున్నారు. తాజాగా రాజస్థాన్‌లోని అల్వార్‌లో చోటుచేసుకున్న ఇలాంటి ఘటనే నెటిజన్లను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది.ఉద్యోగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోహుయా దిబారా సమీపంలో ఒక భారీ కంటైనర్ లారీ డ్రైవర్ చేసిన విన్యాసాలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాయి. కదులుతున్న భారీ వాహనానికి స్టీరింగ్ వదిలేసిన డ్రైవర్, క్యాబిన్ టాప్‌పైకి ఎక్కి నిర్లక్ష్యంగా డాన్స్ చేశాడు. అంతేకాకుండా, కిటికీ డోర్ పట్టుకుని వేలాడుతూ ప్రమాదకరమైన స్టంట్స్ చేశాడు. ఈ దృశ్యాలను చూసిన రోడ్డుపై వెళ్తున్న ఇతర వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. లారీ ఏ క్షణాన అదుపు తప్పుతుందోనని భయపడిన ప్రయాణికులు, తమ వాహనాలను దూరంగా నడుపుకుంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణించారు.
మరిన్ని వీడియోల కోసం :
గ్లోబల్ బిజినెస్ లెక్కలు మార్చేస్తున్న రామాయణ టీమ్
ఫరియా అబ్దుల్లాను ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు
