అడవిలో లంకెబిందెలు.. వాటి నిండా బంగారం, వజ్రాలు..

Updated on: May 23, 2026 | 9:01 AM

నల్లమల అటవీ ప్రాంతంలో లంకెబిందెలు దొరికాయన్న ప్రచారం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సంచలనం రేపుతోంది. గిద్దలూరు టైగర్ రిజర్వ్ పరిధిలో అటవీశాఖ అధికారులే రహస్యంగా తవ్వకాలు జరిపి వజ్రాలు, బంగారం స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతుండగా, పోలీసులు విచారణ ప్రారంభించారు. అసలు నిజాలు దర్యాప్తు పూర్తయ్యాకే వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

నల్లమల అటవీ ప్రాంతంలో లంకెబిందెలు దొరికాయన్న వార్త ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దావానలంలా వ్యాపిస్తోంది. గిద్దలూరు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని యర్రకుంట్ల సమీపంలో ఓ గుప్తనిధుల ముఠా ఇచ్చిన సమాచారంతో అటవీశాఖ అధికారులే స్వయంగా తవ్వకాలు జరిపి, లభించిన వజ్రాలు, బంగారాన్ని స్వాహా చేశారనే ప్రచారం కలకలం రేపుతోంది. నెల రోజుల క్రితం తురిమెళ్ళ అటవీ క్షేత్ర పరిధిలోని వెలగలపాయ ఫారెస్ట్‌ బీట్‌ అధికారి, కొందరు ట్రైబల్ వాచర్లతో కలిసి ఈ తవ్వకాలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ తవ్వకాల్లో రెండు పెద్ద మట్టి కుండలు బయటపడగా, అందులో కోట్లాది రూపాయల విలువైన వజ్రాలు, పురాతన బంగారం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వాటిని తొలుత హైదరాబాద్‌లో విక్రయించేందుకు ప్రయత్నించి, కుదరకపోవడంతో బెంగళూరులో అమ్ముకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు, ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ వ్యవహారంపై మీడియా ప్రతినిధులు వివరణ కోరగా అటవీశాఖ అధికారులు స్పందించేందుకు నిరాకరించారు. అయితే, గుప్తనిధుల తవ్వకాల గుసగుసలు పోలీసుల వరకు చేరడంతో స్థానిక పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. పోలీసుల దర్యాప్తు ముగిస్తేనే కానీ ఈ లంకెబిందెల వెనుక ఉన్న అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బీర్ సీసాలో కండోమ్ ప్యాకెట్! కస్టమర్‌ షాక్‌

ఆహా.. ఇలాంటి అత్తింటివారుంటే..అల్లుడికి నిత్యం పండగే!

Loading...
Unable to load recommendations.
Follow Us