Adorable Video Viral: పనిచేసే కార్మికుడితో సరదాగా ఆటలు ఆడిన అల్లరి గున్న ఏనుగు.. ఎవరు గెలిచారంటే..!

Adorable Video Viral: జంతువులు చిన్న వయసులో ఉన్నప్పుడు ఎంత ముద్దొస్తాయో అవి చేసే చిలిపి పనులు కూడా అంతే ముద్దుగా ఉంటాయి. అవి పేరకే జంతువులు గానీ మనలో ఒకరిగి ఇమిడిపోయి జీవిస్తుంటాయి..

Adorable Video Viral: పనిచేసే కార్మికుడితో సరదాగా ఆటలు ఆడిన అల్లరి గున్న ఏనుగు.. ఎవరు గెలిచారంటే..!
Adorable Video Viral

Updated on: Apr 09, 2021 | 12:47 PM

Adorable Video Viral: జంతువులు చిన్న వయసులో ఉన్నప్పుడు ఎంత ముద్దొస్తాయో అవి చేసే చిలిపి పనులు కూడా అంతే ముద్దుగా ఉంటాయి. అవి పేరకే జంతువులు గానీ మనలో ఒకరిగి ఇమిడిపోయి జీవిస్తుంటాయి. మనతో పోట్లాడేందుకు, మనతో ఆడుతూ, మన ఆహారం లాక్కునేందుకు పోటీ పడుతూ.. ఇలా అవి చేసే ప్రతీ పని మనకు ఎంతో ఉల్లాసానిస్తుంటాయి. మన ఇళ్లలో పెంపుడు జంతువులను పెంచుకునే వాళ్లకు ఇదంతా అనుభవం ఉంటుంది. ఇలాంటి చిలిపి పనులు చేస్తున్న ఓ గున్న ఏనుగు వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

ఎన్‌క్లోజర్‌లో పనిచేసే కార్మికుడిని ఓ గున్న ఏనుగు సరదాగా ఆటపట్టించింది. అతనితో మజాక్‌లు చేస్తూ, ఆ కార్మికుడిని పనిచేయనీకుండా అడ్డుకుంది. అన్ని చేస్తూ మళ్లీ తనకి ఏమీ తెలీదు నేను తల్లిచాటు పిల్లనంటూ పెద్ద ఎనుగు వెనకాలే నక్కింది. ఇలా ఆ పనివాడితో కాసేపే సరదాగా పోట్లాడుతూ, కిందపడేసి రెజ్లింగ్‌లో మాదిరిగా ఆతనిపై కాసేపు ఉండిపోయింది. చివరకు నేనే గెలిచానోచ్‌.. అంటూ పనివాడి పైనుంచి పైకి లేచింది. ఈ ముద్దొచ్చే వీడియోను గన్నుప్రేమ్‌ అనే వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.ఈ వీడియో పోస్ట్‌ చేసిన కొద్ది సేపటికే 93 వేలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. 11 వేలకుపైగా లైక్స్‌ వచ్చాయి. ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు ‘సో క్యూట్‌ గన్నూ’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Also Read:  చల్లదన్నాని ఇచ్చే టేస్టీ టేస్టీ మామిడి కాయ రసం తయారీ విధానం

సాప్ట్ వేర్ జాబ్ వదిలి చెరువులో ముత్యాలు పండిస్తూ.. లక్షలను ఆర్జిస్తున్న యువకుడు ఎక్కడంటే..!