కిరాణా వ్యాపారి ఖతర్నాక్‌ స్కెచ్‌..పేదల బంగారం స్వాహా

Updated on: Apr 03, 2026 | 6:57 PM

అద్దంకిలో ఓ కిరాణా వ్యాపారి పేదల అవసరాలను ఆసరాగా చేసుకుని అక్రమంగా బంగారం తాకట్టు వ్యాపారం నిర్వహిస్తున్నాడు. పేద మహిళల బంగారాన్ని కాజేసేందుకు ప్రయత్నిస్తూ, తిరిగి అడిగితే అధికార పార్టీ అల్లుడి అండతో బెదిరిస్తున్నాడు. బాధితులు న్యాయం కోసం నిరసన తెలపగా, పోలీసులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభించారు. ఈ మోసంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పేదల అవసరాలను ఆసరాగా చేసుకుని, వారి కష్టార్జితమైన బంగారాన్ని కాజేసేందుకు ఓ కిరాణా వ్యాపారి వేసిన స్కెచ్ ఇప్పుడు అద్దంకి పట్టణంలో కలకలం రేపుతోంది. ఫ్యాన్సీ, కిరాణా వ్యాపారం పేరుతో లోపల అక్రమంగా బంగారం తాకట్టు వడ్డీ వ్యాపారం నిర్వహిస్తూ, తీరా నగలు తిరిగి ఇవ్వమంటే బెదిరింపులకు దిగుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని ‘శ్రీ ప్రసన్నాంజనేయ జనరల్ స్టోర్స్’ యజమాని నూకల రామాంజనేయులు, ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా బంగారం, వెండి తాకట్టు వ్యాపారం నిర్వహిస్తున్నాడు. గుర్రాల కాలనీకి చెందిన నిరుపేద మహిళల వద్ద నుంచి నగలు తీసుకుని, కేవలం చిన్న స్లిప్పులు రాసిచ్చి వడ్డీకి డబ్బులు ఇచ్చేవాడు. ప్రస్తుతం మార్కెట్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకడంతో, సదరు వ్యాపారి బాధితుల నగలను కొట్టేయడానికి ప్లాన్‌ చేశాడు. తమ అవసరాల కోసం తాకట్టు పెట్టిన నగలను అసలు, వడ్డీ చెల్లించి విడిపించుకుంటామని గత రెండు నెలలుగా మహిళలు వ్యాపారి చుట్టూ తిరుగుతున్నారు. అయితే, నగలు ఇచ్చేందుకు నిరాకరించడమే కాకుండా, అధికార పార్టీలో ఉన్న తన అల్లుడి అండతో బాధితులను బెదిరిస్తున్నాడని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం కావాలంటూ బాధితులు పసిపిల్లలతో సహా షాపు ముందు బైఠాయించి కన్నీరుమున్నీరవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. అక్రమంగా ఫైనాన్స్ నిర్వహిస్తూ పేదలను మోసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వేసవిలో బంగాళాదుంపలు తింటున్నారా.. జాగ్రత్త

ఓర్నీ.. విమానంలో ఉన్నప్పుడు.. నీకిదేం పోయేకాలం రా

అబ్బా.. ఈ కోతి ఎంత మంచిదో.. దీని సంస్కారానికి ఫిదా అవుతున్న నెటిజన్లు

బిర్యానీలో లెగ్ పీస్‌లు లేవని.. పెళ్లి పందిట్లో విరిగిన కుర్చీలు

సెల్ఫీలు దిగుతూ తెగ మురిసిపోయిన కొండముచ్చు..

Follow Us